రామగుండం RFCLలో ఉద్యోగాలు: మంచి జీతం.. ఎగ్జామ్ లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే సెలెక్షన్..

రామగుండం RFCLలో ఉద్యోగాలు: మంచి జీతం.. ఎగ్జామ్ లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే సెలెక్షన్..

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్​సీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీర్, మేనేజర్, ఆఫీసర్ పోస్టులతో కలిపి మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 26న ప్రారంభం కాగా సెప్టెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 40. 

విభాగాల వారీగా ఖాళీలు: ఇంజినీర్ (కెమికల్) 12, అసిస్టెంట్ మేనేజర్ (కెమికల్) 4, డిప్యూటీ మేనేజర్ (కెమికల్) 2, ఇంజినీర్ (మెకానికల్) 3, ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 3, ఆఫీసర్ (మెటీరియల్స్) 4, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాన్స్​పోర్టేషన్)  1, ఆఫీసర్ (హెచ్ఆర్) 1, ఆఫీసర్ (సెక్రటేరియల్) 1, అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ 1, చీఫ్ మెడికల్ ఆఫీసర్ 1, అకౌంట్స్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ మేనేజర్ (ఎఫ్ & ఏ) 2, చీఫ్ ఇంజినీర్ (ఎఫ్ & ఏ) 1, ఇంజినీర్ (ఐటీ) 1.  

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ/ పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్, సీఏ లేదా సీఎంఏ పూర్తిచేసి ఉండాలి. ఉద్యోగ అనుభవం తప్పనిసరి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్  ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్​మన్/ డిపార్ట్​మెంటల్ అభ్యర్థులకు ఫీజు ఉండదు. మిగతా అభ్యర్థులకు రూ. 1000 
(ఈ–5 పోస్టులు, ఆపైన), రూ. 700 (ఈ–1పోస్టుల నుంచి ఈ– వరకు) చెల్లించాలి. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 24. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  rfcl.co.inను సందర్శించండి.