క్షమాపణలు చెప్పిన బాబా రాందేవ్

క్షమాపణలు చెప్పిన బాబా రాందేవ్

న్యూఢిల్లీ: అల్లోపతి మెడిసిన్స్‌‌పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. తన కామెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలని చెప్పిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్‌‌కు ప్రతిగా రాందేవ్ ఓ లెటర్ రాశారు. ఆధునిక వైద్యానికి తాను విరోధిని కాదని ఆ లేఖలో బాబా స్పష్టం చేశారు. ప్రాణాలను రక్షించే విషయంలో అల్లోపతి శస్త్రచికిత్స అపారమైన పురోగతిని చూపించిందని, అది మానవాళికి చాలా సేవ చేస్తుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు. అల్లోపతి మీద తన వ్యాఖ్యలు వాలంటీర్ల సమావేశంలో ఓ వాట్సప్ మేసేజ్ చదివే క్రమంలో చదివిందే తప్ప.. ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి చేయలేదన్నారు. ఆ కామెంట్‌‌లు ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. కరోనా కాలంలో అల్లోపతి డాక్టర్లు తమ ప్రాణాలను లెక్కచేయకుండా కోట్లాది మందిని కాపాడారని కొనియాడారు.