RGV: రాజమౌళి.. నువ్వు వెంటనే సెక్యూరిటీ పెంచుకో: ఆర్జీవి

RGV: రాజమౌళి.. నువ్వు వెంటనే సెక్యూరిటీ పెంచుకో: ఆర్జీవి

ఆర్ఆర్ఆర్ సినిమా డైరెక్టర్ రాజమౌళిని హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రశంసించడంపై ఆర్జీవీ స్పందించారు. తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించాడు. భారతీయ సినిమాని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినందుకు గర్వంగా ఉందన్నాడు. ఒక భారతీయ దర్శకుడు ఈ స్థాయికి చేరుకుంటాడని అప్పటి దాదా సాహెబ్ ఫాల్కే నుంచి ఇప్పటి రాజమౌళి వరకు ఎవరూ ఊహించి ఉండరని ఆర్జీవీ అన్నాడు.  

‘మొఘల్ ఏ ఆజమ్ తీసిన ఆసిఫ్, షోలే తీసిన రమేష్ సిప్పిలతో పాటు ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, బన్సాలీలను నువ్వు ఎప్పుడో దాటిపోయావు. దేశంలో ఫిల్మ్ మేకర్స్ అందరూ నీపై అసూయతో ఉన్నారు. హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వు వెంటనే సెక్యూరిటీ పెంచుకోవాలి. నేను ఇప్పటికే 4 డ్రింక్స్ తాగి ఉన్నా. అందుకే రహస్యాన్ని బయటపెడుతున్నా’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.