తల్లైన ఆలియా భట్.. కపూర్ కుటుంబంలో ఆనందోత్సాహాలు

తల్లైన ఆలియా భట్..  కపూర్ కుటుంబంలో ఆనందోత్సాహాలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ బిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు.. తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆదివారం ఆస్పత్రిలో ఆలియా అడ్మిట్ అయ్యారు. డెలివరీ సమయంలో ఆమె భర్త రణ్ బీర్ కపూర్ కూడా ఆస్పత్రిలోనే ఉన్నట్లు సమాచారం. తల్లైన ఆలియా భట్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నటీ నటులు కూడా వారికి విషెస్ తెలియజేస్తున్నారు.

బిడ్డ జన్మించడంతో కపూర్ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. రణబీర్ కపూర్ - ఆలియా భట్ లు 2022 ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. తాను గర్భం దాల్చినట్లు.. పెళ్లైన రెండు నెలలకే ఆలియా ప్రకటించారు. గర్భిణిగా ఉన్న సమయంలో షూటింగ్స్ లో కూడా పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా నటించారు. హీరో రామ్ చరణ్ ప్రేయసి సీత పాత్రను ఆమె పోషించారు. ఆలియా..ఆమె భర్త రణబీర్ కపూర్ జంటగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’  మూవీ ఇటీవలే విడుదలైంది.