సిరిసిల్లలో బీజేపీ గెలుపు ఖాయం : రాణీరుద్రమ 

సిరిసిల్లలో బీజేపీ గెలుపు ఖాయం : రాణీరుద్రమ 

రాజన్నసిరిసిల్ల,వెలుగు: సిరిసిల్లలో తమ గెలుపు ఖరారైందని సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణీరుద్రమ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల నియోజక వర్గంలో మహిళకు ప్రాధాన్యం కల్పిస్తూ బీజేపీ.. కేటీఆర్ పై తనను పోటీకి దింపిందన్నారు.

సిరిసిల్లలోని మెజార్టీ  ప్రజలు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇంటికి పంపేందుకు నిర్ణయించుకుని బీజేపీకి ఓటేశారన్నారు. కేంద్ర పథకాలు, నరేంద్రమోదీ పాలన, బీసీ సీఎం హామీలు.. ఐదేండ్లలో బీఆర్ఎస్​సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బీజేపీ పోరాటంతో ప్రజలు తమకు ఓటేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. ఆమె వెంట బీజేపీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి గంగాడి మోహన్ రెడ్డి, రెడ్డబోయిన గోపి, నాగుల శ్రీనివాస్, అనిల్, మంతుర్తి శ్రీను పాల్గొన్నారు.