
జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మల్యాల పీఎస్లో మహిళా కానిస్టేబుల్ వేదశ్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. డ్యూటీ అయిన తరువాత ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్ఠితిలో వేదశ్రీకి ప్రాథమిక చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచింది. జిల్లా ఎస్పీ వేదశ్రీ మృతదేహానికి నివాళులర్పించి.. ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు. వేదశ్రీ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.