అనంతపురం జిల్లాలో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

అనంతపురం జిల్లాలో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

అనంతపురం పట్టణ శివారులో దారుణం జరిగింది. ఎర్రనేల కొట్టాల్లో కాపురముంటున్న ఓ కుటుంబానికి చెందిన 4 ఏళ్ల చిన్నారిపై 40 ఏళ్ల కిరణ్ అనే వ్యక్తి మద్యం మత్తులో లైంగిక దాడి చేశాడు. ఇంట్లో ఎవరూ లేని వేళలో పాపకు చాకొలెట్స్ ఇప్పిస్తానంటూ వెళ్లి.. దారుణానికి పాల్పడ్డాడు.

చిన్నారి తండ్రి ఆటో డ్రైవర్ గా, తల్లి ఓ హాస్పిటల్ లో పనికి వెళ్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీళ్లు పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి కొంత అలస్యం అవుతుండటంతో… పక్కింట్లో పాపను వదిలివెళ్లారు. ఆడుకోవడానికి పాప ఇంటి బయటకు రావడంతో… కిరణ్ ఆ పాపకు చాకొలెట్స్ ఆశ చూపి పక్కకు తీసుకుపోయాడు. దారుణానికి ఒడిగట్టాడు. పాప బిగ్గరగా ఏడ్వడంతో ఓదారుస్తున్న టైమ్ లో తల్లిదండ్రులు వచ్చారు. పాపకు రక్తస్రావం చూసి… జరిగింది అర్థం చేసుకుని… హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

బాధితులు, స్థానికులు కిరణ్ ను కొట్టి… పోలీసులకు అప్పగించారు. త్రీ టౌన్ పోలీసులు.. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఏ పాపం తెలియని చిన్నారిపై లైంగిక దాడి చేసిన నిందితుడు కిరణ్ కు బహిరంగ ఉరిశిక్ష వేయాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు , బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.