ఫిలిప్స్కు రాషా థడానీ ప్రచారం

ఫిలిప్స్కు రాషా థడానీ ప్రచారం

హైదరాబాద్​, వెలుగు: హెయిర్ స్టైలింగ్ బ్రాండ్ ఫిలిప్స్ ఇండియా తన కొత్త  ప్రొడక్టుల ప్రచారానికి బాలీవుడ్​ నటి రాషా థడానీని బ్రాండ్ అంబాసిడార్‌‌‌‌గా నియమించింది. భారతీయ జుట్టు రకాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన హెయిర్ డ్రయర్లు, స్ట్రెయిట్‌‌‌‌నర్లు వంటి పరికరాలకు ఆమె ప్రచారం చేస్తారు. జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా స్టైలింగ్ చేసుకోవడంపై ఈ క్యాంపెయిన్​ దృష్టి సారిస్తుంది.  వీటిని ఈ–కామర్స్​, రిటైల్ స్టోర్లలో కొనుక్కోవచ్చు.