‘సామ్నా’ ఎడిటర్ గా రష్మీ థాక్రే

‘సామ్నా’ ఎడిటర్ గా రష్మీ థాక్రే

ముంబై : శివసేన పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’ కు ఎడిటర్ గా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే భార్య రష్మీ థాక్రే నియమితులయ్యారు. సామ్నా సండే ఎడిషన్ లో ఎడిటర్ గా ఆమె పేరును ముద్రించింది. మహారాష్ట్ర ప్రజలకు పార్టీ అభిప్రాయాలను తెలియజేయడానికి సామ్నా పత్రికను 1988 జనవరి 23న శివసేన వ్యవస్థా పకుడు బాల్ థాక్రే ప్రారంభించారు.

అప్పటినుంచి ఆయనే వ్యవస్థాపక సంపాదకుడిగా పనిచేశారు. 2012లో బాల్ థాక్రే చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఉద్ధవ్ థాక్రే ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా ప్రమాణం చేసేముందు ఎడిటర్ పదవికి ఆయన రిజైన్ చేశారు.