బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కాక్టెయిల్ 2’ ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కొద్ది సేపటికే ఈ ట్రైలర్ సినీ అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు హోమీ అదాజానియా తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నల బాండింగ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ముగ్గురి మధ్య ఉన్న బాండింగ్ హైలైట్‌గా నిలిచింది. కృతి, రష్మిక తమ సమ్మర్ అవుట్‌ఫిట్స్‌లో బీచ్ ఒడ్డున మెరిసిపోతుంటే, షాహిద్ కపూర్ తనదైన స్వాగ్‌తో అదరగొట్టేశాడు. ముఖ్యంగా రష్మిక, షాయిద్ మధ్య వచ్చే రొమాంటిక్ & ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి జబ్ తలక్, మషూకా, తుఝ్కో పాటలను విడుదల చేసి ఆసక్తి పెంచగా.. ఇప్పుడు ట్రైలర్తో మరింత క్యూరియాసిటీ కలిగించారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్.. ‘ఫ్రెండ్స్ నుంచి లవర్స్ వరకు.. అక్కడి నుంచి పూర్తి గందరగోళం వరకు. పర్ఫెక్ట్ మిక్స్ మళ్లీ వచ్చేసింది’ అంటూ క్యాప్షన్ ఇచ్చి యూత్ క్రేజీనెస్ తీసుకొచ్చింది.
Friendship, love, chaos, confusion!
— Maddockfilms (@MaddockFilms) June 2, 2026
This Cocktail is here to win hearts, Trailer Trending #1 on X 🥰
Watch the full trailer on YouTube!
🔗- https://t.co/fhytujMLHq#Cocktail2 in cinemas on 19th June. pic.twitter.com/DAh9xE6BaV
రొమాన్స్, ఫ్రెండ్‌షిప్, ఎమోషన్స్..
ట్రైలర్‌లో షాహిద్, కృతి, రష్మిక పాత్రలను పరిచయం చేస్తూ వారి మధ్య ఉన్న బంధాలు, ప్రేమ, స్నేహం, భావోద్వేగ సంఘర్షణలను చూపించారు. షాహిద్ కపూర్ ఇద్దరు హీరోయిన్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటూ కనిపించగా, వారి మధ్య సాగే ప్రేమ త్రికోణం కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మూడు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ట్రైలర్ షాహిద్ కపూర్ పాత్ర వాయిస్ ఓవర్‌తో ప్రారంభమవుతుంది. ప్రేమ, స్నేహం కలిసిపోయినప్పుడు సంబంధాలు ఎంత క్లిష్టంగా మారతాయో, షాహిద్ క్రేజీ డైలాగ్తో చెప్పడం ఆకట్టుకునేలా ఉంది.
‘‘ఏ బంధమైనా కొత్తగా ఉన్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. కొత్త స్నేహితుల కథలు వినడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. కానీ పాత స్నేహితుల అదే కథలను మళ్లీ మళ్లీ వింటూ ఉంటే ఒక దశలో విసుగు మొదలవుతుంది. ప్రేమ కూడా ఒక పాత టీ-షర్ట్‌లాంటిదే.. అందులో రెండు రాత్రులు ఎంతో హాయిగా గడపొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రేమ స్నేహంగా మారుతుందో, లేదా స్నేహంలోకి ప్రేమ అడుగుపెడుతుందో.. అప్పుడే అసలు గందరగోళం మొదలవుతుంది. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఒకటే మార్గం ఉంటుంది..’’ అని షాహిద్ కపూర్ చెబుతుండగా, మధ్యలో ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ "లైక్ ఎ త్రీసమ్?" అంటూ సరదాగా ప్రశ్నిస్తుంది. ఈ ఫన్నీ డైలాగ్‌తో ట్రైలర్‌కు హైలైట్ మూమెంట్ దక్కింది.
►ALSO READ | విజయ్ అన్న వల్లే నా బిడ్డ చనిపోయింది.. దళపతి ఫ్యాన్స్‌పై నటి జూలీ సీరియస్..
ఇప్పటికే విడుదలైన మషూకా పాట ద్వారా షాహిద్, కృతి పాత్రల మధ్య ఉన్న స్నేహం-ప్రేమ కలయికను చూపించారు. అందమైన బీచ్‌లు, వెకేషన్ బ్యాక్‌డ్రాప్‌ల మధ్య వారి బాండింగ్ మరింత బలపడుతున్నట్లు పాటలో చూపించారు.
అలాగే తుఝ్కో పాటలో షాహిద్, రష్మికల కాలేజ్ లవ్ స్టోరీని ఆవిష్కరించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన రష్మిక పాత్రతో షాహిద్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌ను ఎలా కొనసాగించాడో ఆ పాటలో చూపించారు.
which one's your favourite? 🥰💃#Cocktail2 in cinemas on 19th June. pic.twitter.com/sP3W9wNdNB
— Maddockfilms (@MaddockFilms) May 31, 2026
ఇప్పుడు ట్రైలర్ విడుదల కావడంతో ఈ ముగ్గురు పాత్రల మధ్య ఉన్న సంబంధాలపై ప్రేక్షకులకు కొంత క్లారిటీ వచ్చింది. అయితే అసలు కథలోని కీలక ట్విస్టులు, ఎమోషన్స్ మూమెంట్స్ మాత్రం ఇంకా రహస్యంగానే ఉంచారు. ఈ క్రమంలోనే సినిమా విడుదలపై మరింత ఆసక్తి పెరిగింది.
జూన్ 19న థియేటర్లలో..
ఈ సినిమాకు తరుణ్ జైన్, లవ్ రంజన్ కథా రచన అందించగా, హోమీ అదాజానియా దర్శకత్వం వహించారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ‘కాక్టెయిల్ 2’ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇకపోతే, ఈ రొమాంటిక్ మూవీ 2012లో విడుదలైన 'కాక్‌టెయిల్'కి సీక్వెల్. దాదాపు 14 ఏళ్ళ తర్వాత మూవీకి సీక్వెల్ వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
