అందుకేనా అంత అందం : రష్మిక గ్లామర్ సీక్రెట్ ఇదేనంట..!

అందుకేనా అంత అందం : రష్మిక గ్లామర్ సీక్రెట్ ఇదేనంట..!

రష్మిక గ్లామర్ సీక్రెట్ స్కిన్ కేర్ విషయంలో రష్మిక చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ సీక్రెట్ గురించి ఈమధ్య రివీల్ చేసింది. అదేంటంటే... 

అందం దెబ్బతినకుండా ఉండాలంటే హెల్దీఫుడ్ తినాలి. పడని ఫుడ్ తింటే ఆ ఎఫెక్ట్ అందం మీద పడుతుంది. అందుకే రష్మిక కొత్తరకం ఫుడ్ తినేముందు ఫుడ్ అలర్జీ టెస్ట్ చేయించుకుంటుంది. అంతేకాదు నూనె ఎక్కువ ఉన్న కూరలు, వేపుళ్లలాంటివి తిననే తినదట. చర్మం లేతగా కనిపించేందుకు నీళ్లు బాగా తాగుతుంది. 

సన్ స్క్రీన్ రాసుకోనిదే బయటకి అడుగుపెట్టదు. స్కిన్ మెరుస్తూ ఉండేందుకు రెగ్యులర్ గా విటమిన్-సి సీరమ్ వాడుతుంది. మాయిశ్చరైజర్ ముఖం మీద మాత్రమే రాసి వదిలిపెట్టకుండా.. మెడ, కళ్ల కింద కూడా రాసుకుంటుంది. చర్మం పొడిబారుతుందని రోజుకు రెండుసార్లు మాత్రమే ముఖాన్ని శుభ్రం చేసుకుంటుంది. చర్మం మీద ఉండే డెడ్ సెల్స్ ఎప్పటికప్పుడు పోయే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది.