షారుఖ్ తో రష్మిక.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బ్యూటీ

షారుఖ్ తో రష్మిక.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బ్యూటీ

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika mandanna) వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) తో పుష్ప2(Pushpa2) చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో రణ్బీర్(Ranbir kapoor) హీరోగా వస్తున్న యానిమల్(Animal) సినిమాలో నటిస్తోంది. అర్జున్ రెడ్డి(Arjun reddy) ఫేమ్ సందీప్ రెడ్డి(Sandeep reddy vanga) వంగ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. డిసెంబర్ లో రిలీజ్ కానుంది. 

అయితే తాజాగా సమాచారం మేరకు ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. అదేంటంటే.. రష్మిక బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah rukh khan) తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసిందట కానీ.. సినిమా కోసం కాదు. ఒక యాడ్ షూటింగ్ కోసం. షారుఖ్ ప్రస్తతం ఒక బ్రాండ్ కోసం యాడ్ షూట్ లో ఉన్నారు. అందులో ఫీమేల్ లీడ్ కోసం రష్మికను తీసుకున్నారట మేకర్స్. ఈ న్యూస్ తెలుసుకున్న ఈ బ్యూటీ చాలా హ్యాపీగా ఫీల్ అయిందట. నిజానికి రష్మికకు ఈ ఆఫర్ రావడం గొప్ప విషయమే. ఎందుకంటే.. షారుఖ్ పక్కన చిన్న ఫ్రెమ్ లో అయినా కనిపించాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాంటిది ఆ అవకాశం రశ్మికకు దక్కింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ ఆవుతోంది.

Also Read :- రవితేజకి విలన్గా మంచు మనోజ్? డైరెక్టర్ ఎవరంటే?

ఇక షారుఖ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన హీరోగా జవాన్ అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా .. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.