క్రెడిట్ కార్డుదారులకు షాక్ : ఇక నుంచి అలా పేమెంట్ చేయటానికి వీల్లేదు

క్రెడిట్ కార్డుదారులకు షాక్ : ఇక నుంచి అలా పేమెంట్ చేయటానికి వీల్లేదు

క్రెడిట్ కార్డుదారులకు షాక్.. క్రెడిట్ కార్డుల బిల్లులను చాలా మంది ఫోన్, క్రైడ్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగిస్తున్నా రు. జూన్ 30 తరువాత ఇలా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు కుదరకపోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెల్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే జరగాలని ఆర్బీఐ నిబంధన పెట్టింది. ఇది జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది.

బిల్లుల చెల్లింపులో సమర్ధత, భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇందు కోసం బ్యాంక్ లు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ను అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి 8 బ్యాంక్ లు మాత్రమే ఈ సిస్టమ్ ను యాక్టివేట్ చేసుకున్నాయి. హెచ్ఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లు ఇంకా ఈ పేమెంట్ సి స్టోమ్ ను యాక్టివేట్ చేయలేదు. 

దీని వల్ల ఫోన్ పే, క్రైడ్ వంటి సంస్థలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. అందువల్ల ఈ యాప్స్ నుంచి చెల్లింపులు చేయడం వీలుకాదు. ఆయా బ్యాంక్ లు యాప్ లు, వెబ్ సైట్ ద్వారా చెల్లింపులకు ఇబ్బంది ఉండదు.