బ్యాంకుల ప్రైవేటైజేషన్‌పై ఆర్‌‌‌‌బీఐ క్లారిటీ

బ్యాంకుల ప్రైవేటైజేషన్‌పై ఆర్‌‌‌‌బీఐ క్లారిటీ
  • ఎంపీసీ మినిట్స్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
  • ఇన్ఫ్లేషన్ ఇంకా 6శాతానికి పైన కొనసాగడమే కారణం

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ఫలితంగా వడ్డీ రేట్లను మరింత పెంచడానికి ఆర్‌‌‌‌బీఐకి వీలుంటుందని తాజా ఎంపీసీ మీటింగ్‌‌ మినిట్స్‌‌లో  రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌‌‌‌ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.  దేశంలో ఇన్‌‌ఫ్లేషన్ ఇంకా హై లెవెల్‌‌లోనే కొనసాగుతోందని, దీన్ని తగ్గించేందుకు సరియైన చర్యలు తీసుకోకపోతే సమస్యలు నెలకొంటాయని వివరించారు. ఆర్‌‌‌‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)  ఈ నెల 5 న రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.

ఫలితంగా దేశంలో రెపో రేటు 5.4 శాతానికి చేరుకుంది. రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్ ఈ ఏడాది ఏప్రిల్‌‌లో 7.8 % వద్ద పీక్‌‌ (గరిష్ట) లెవెల్‌‌ను టచ్ చేసింది. అక్కడి నుంచి తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది జులైలో రిటైల్‌‌ ఇన్‌‌ఫ్లేషన్ 6.7 శాతంగా నమోదయ్యింది. అయినప్పటికీ, ఇది ఆర్‌‌‌‌బీఐ పెట్టుకున్న లిమిట్‌‌ 6 శాతం కంటే పైనే ఉంది. హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌ వరసగా 15 వ నెలలోనూ రెండంకెల్లోనే నమోదయ్యింది.    

75 బేసిస్ పాయింట్ల పెంపు!

ఎంపీసీ మెంబర్ జయంత్ ఆర్‌‌‌‌ వర్మ మినహా మిగిలిన ఐదుగురు మెంబర్లు  అకామిడేషన్ (పాలసీ సులువు)  వైఖరిని వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపారు. ‘ఈ స్టేట్‌‌మెంట్‌‌ ఇంకా కన్ఫ్యూజ్ చేస్తోంది’ అని మినిట్స్‌‌లో వర్మ అన్నారు. అకామిడేషన్ వైఖరిని వెనక్కి తీసుకోవడం అంటే కరోనాకు ముందు ఉన్న వైఖరి కాదని, కరోనా తర్వాత ఆర్‌‌‌‌బీఐ చూపిన అకామిడేషన్ వైఖరి వెనక్కి తీసుకుంటామని ఆయన క్లారిఫై చేశారు. 

కరోనా తర్వాత రెపో రేటును 6.50 %– 6.25 % లెవెల్ నుంచి ఆర్‌‌‌‌బీఐ ఎంపీసీ తగ్గిస్తూ వచ్చింది. రానున్న ఎంపీసీ మీటింగ్‌‌లలో రెపో రేటును తిరిగి ఈ లెవెల్‌‌కు తీసుకొస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇన్‌‌ఫ్లేషన్ ఇంకా హై లెవెల్‌‌లోనే కొనసాగడంతో  రెపో రేటును 50 లేదా 60 లేదా 75 బేసిస్ పాయింట్లు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘లాజిక్‌‌ ప్రకారం చూస్తే 75 బేసిస్ పాయింట్ల  పెంపు ఉత్తమం. 

దీని వలన ఆర్‌‌‌‌బీఐ మానిటరీ పాలసీపై క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇన్‌‌ఫ్లేషన్ ఇంకా వేగంగా దిగిరావడానికి వీలుంటుంది’ అని వర్మ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 75 బేసిస్ పాయింట్లు పెంపు ఉండకపోవచ్చని చెప్పారు. మార్కెట్‌‌ 35–50 బేసిస్ పాయింట్ల పెంపును అంచనావేస్తోందని, ఇంతకన్నా ఎక్కువ పెంచితే మార్కెట్‌‌లో పానిక్ పెరుగుతుందని, అనవసరంగా గందరగోళం నెలకొంటుందని అన్నారు.

బ్యాంకుల ప్రైవేటైజేషన్‌‌కు వ్యతిరేకం కాదు.. 

గురువారం విడుదల చేసిన ఆర్టికల్‌‌లోని వైఖరి రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ వైఖరిని రిప్రెజెంట్ చేయడం లేదని, కేవలం అది రాసిన వారి వైఖరినే తెలుపుతోందని ఆర్‌‌‌‌బీఐ శుక్రవారం క్లారిఫై చేసింది. వేగంగా  బ్యాంకులను ప్రైవేటికరిస్తే బ్యాంక్ సేవలను అందరికి అందించడంలో సమస్యలు తలెత్తుతాయని గురువారం ఆర్‌‌‌‌బీఐ ఓ బులెటిన్‌‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.