రికవరీ ఏజెంట్లు వేధించడంతో.. ఆర్​బీఎల్​ బ్యాంకుకు రూ.2.27 కోట్ల ఫైన్​

రికవరీ ఏజెంట్లు వేధించడంతో.. ఆర్​బీఎల్​ బ్యాంకుకు రూ.2.27 కోట్ల ఫైన్​

న్యూఢిల్లీ:  ప్రైవేట్ రంగ లెండర్​  ఆర్​బీఎల్ బ్యాంక్​కు​  ఆర్​బీఐ రూ.2.27 కోట్ల ఫైన్​ వేసింది. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల గురించి  ఇచ్చిన  కొన్ని ఆదేశాలను పాటించనందుకు ఈ చర్య తీసుకుంది. 2018–-19 నుండి 2021–22 ఆర్థిక సంవత్సరాల్లో ముంబైకి చెందిన ఈ బ్యాంక్​ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను వేధించినట్టు  ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన  సెంట్రల్ బ్యాంక్..  ఆర్​బీఎల్ రూల్స్​ను పాటించలేదని గుర్తించింది.  లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు లేదా వేధింపులకు పాల్పడకుండా ఆపడంతో  బ్యాంకు విఫలమైందని, వారిని నియమించే ముందు   పోలీసు వెరిఫికేషన్​ చేయించలేదని పేర్కొంది.  ఏజెంట్లు ఎలాంటి బెదిరింపులకు లేదా వేధింపులకు పాల్పడకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆర్​బీఐ పోయిన ఏడాది ఒక సర్క్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జారీ చేసింది. ఇదిలా ఉంటే, ఆర్​బీఎల్​ బ్యాంక్ డిసెంబర్ క్వార్టర్​లో రూ.209 కోట్ల నికర లాభం సాధించింది. 2021–-22 అక్టోబర్–-డిసెంబర్ క్వార్టర్​లో  రూ.156 కోట్ల లాభాన్ని సంపాదించింది.  మొత్తం ఆదా రూ.1,767 కోట్లకు చేరుకుంది.