
రియల్‌మీ ఏసీ సెగ్మెంట్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సబ్సిడరీ అయిన రియల్‌మీ టెక్‌లైఫ్ 4 ఇన్ 1 కన్వర్టబుల్ ఇన్వెర్టర్ ఏసీని లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో వీటి సేల్స్ స్టార్టయ్యాయి. రూమ్‌లోని మనుషులను బట్టి ఏసీ కెపాసిటీ మార్చుకోవడం, 20 నిమిషాల్లో రూమ్‌ని కూల్ చేయడం వంటి ఫీచర్లు ఈ ఏసీలో ఉన్నాయి. 55 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ దగ్గర కూడా ఈ ఏసీ పనిచేస్తుందని రియల్‌మీ పేర్కొంది. 1.0, 1.5 టన్నుల కెపాసిటీతో 4 నుంచి 5 స్టార్‌లు కలిగిన తమ ప్రొడక్ట్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ధర రూ. 28,499.