రియల్​మీ నుంచి నార్జో 70 ప్రో 5జీ ఫోన్​

రియల్​మీ నుంచి నార్జో 70 ప్రో 5జీ ఫోన్​

స్మార్ట్​ఫోన్ ​మేకర్​  రియల్‌మీ మనదేశంలో రియల్​మీ నార్జో 70 ప్రో 5జీ ఫోన్​ను లాంచ్​ చేసింది. ఇందులో 6.67 ఇంచుల స్క్రీన్​, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, వెనుక 50 ఎంపీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ ​బ్యాటరీ, అండ్రాయిడ్ ​14 ఓఎస్​, మీడియాటెక్ ​డైమెన్సిటీ 7050 చిప్​ ఉన్నాయి.

గ్లాస్ గ్రీన్,  గ్లాస్ గోల్డ్ రంగులలో అందుబాటులో ఉంది. 8జీబీ + 128జీబీ వేరియంట్​ధర 18,999 కాగా, 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 19,999. అమ్మకాలు శుక్రవారం నుంచి మొదలయ్యాయి.