మొబైల్ రీఛార్జ్కు ప్లాట్‌‌‌‌ఫారమ్ చార్జీలు

మొబైల్ రీఛార్జ్కు ప్లాట్‌‌‌‌ఫారమ్ చార్జీలు

న్యూఢిల్లీ: పేటీఎం,  ఫోన్​పే వారి ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌లను ఉపయోగించి యుటిలిటీ బిల్లులను చెల్లిస్తే ఇది వరకు క్యాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌లు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.ఇక నుంచి ఈ యాప్‌‌‌‌లు తమ కస్టమర్‌‌‌‌ల మొబైల్ నంబర్‌‌‌‌లను రీఛార్జ్ చేయడానికి, కరెంటు బిల్లులు చెల్లించడానికి ప్లాట్‌‌‌‌ఫారమ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించాయి. యూపీఐ, క్రెడిట్​కార్డ్​, డెబిట్​కార్డ్​.. ఇలా ఏ విధంగా డబ్బు కట్టినా రీఛార్జ్‌‌‌‌లు/బిల్ చెల్లింపుల కోసం ఫోన్​పేని ఉపయోగిస్తే ప్లాట్‌‌‌‌ఫారమ్ చార్జీ కట్టాలి. ఇందులోనే జీఎస్టీ కూడా ఉంటుంది.  

మొబైల్ రీఛార్జ్ విఫలమైతే, చెల్లించిన రీఛార్జ్ మొత్తం (జీఎస్టీతో సహా)తో పాటు ప్లాట్‌‌‌‌ఫారమ్ చార్జ్​ రీఫండ్ అవుతుంది. పేటీఎం యాప్‌‌‌‌ని ఉపయోగించి మీ మొబైల్ నంబర్‌‌‌‌ను రీఛార్జ్ చేయడానికి, ప్రతి మొబైల్ రీఛార్జ్‌‌‌‌కు  రూపాయి చొప్పున ప్లాట్‌‌‌‌ఫారమ్ చార్జ్​ విధిస్తారు. ఫోన్​పే యాప్ రూ.రెండు వసూలు చేస్తున్నది. ఉదాహరణకు ఎయిర్‌‌‌‌టెల్ రూ. 296 మొబైల్ రీఛార్జ్ ప్యాక్​ కావాలంటే పేటీఎం యాప్‌‌‌‌లో రూ. 297 చెల్లించాలి.  ఫోన్​పే యాప్‌‌‌‌లో అయితే రూ. 298 ఖర్చు అవుతుంది. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఛార్జ్ చేస్తామని ఈ యాప్స్​ చెబుతున్నాయి. భవిష్యత్​లో మరింత మందికి చార్జ్​ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి.