జియో: డేటా అయిపోతే లోన్ తీసుకోవచ్చు

జియో: డేటా అయిపోతే లోన్ తీసుకోవచ్చు
  • తర్వాత చెల్లించే ఒప్పందంపై 1జీబీ డేటా లోన్ 
  • నెలకు గరిష్టంగా ఐదుసార్ల వరకు డేటా లోన్ తీసుకోవచ్చు

ముంబయి: రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినయోగదారుల కోసం కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డేటా అయిపోతే అదనపు డేటా రీచార్జ్ చేసుకునే పరిస్థితిలో లేని వారి కోసం .. కొన్ని ఆప్షన్స్ తో 1జీబీ డేటాను లోన్ తీసుకునే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఎమర్జెన్సీ డేటా లోన్ ఫీచర్ కింద ప్రీపెయిడ్ వినియోగదారులు ముందుగా డేటా తీసుకుని తర్వాత చెల్లించవచ్చనేమాట. 
డేటా అయిపోతే.. రీచార్జ్ చేసుకునే అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్న వారు కంగారు పడాల్సిన అవసరం లేకుండా.. రూ.11 చెల్లించి 1 జీబీ డేటా లోన్ పై తీసుకోవచ్చు. మై జియో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉండాలి. యాప్ లో మెను బటన్ లోనే ఎమర్జెన్సీ లోన్ అనే ప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ప్రొసీడ్ చేయమని సూచిస్తుంది. అలా ప్రొసీడ్ బటన్ నొక్కి గెట్ ఎమర్జెన్సీ డేటాను క్లిక్ చేస్తే  1 జీబీ డేటా రీచార్జ్ అవుతుంది.  ఇలా నెలకు ఐదుసార్ల వరకు డేటా లోన్ తీసుకునే అవకాశం కల్పించింది రిలయన్స్ జియో.