జియో మార్ట్ సేవలను ప్రారంభించిన రిలయన్స్

జియో మార్ట్ సేవలను ప్రారంభించిన రిలయన్స్

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనా లాక్ డౌన్ టైమ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా జియో మార్ట్ ద్వారా ఆన్ లైన్ గ్రాసెరీ షాపింగ్ పోర్టల్ టెస్టింగ్ ను మొదలుపెట్టింది. సుమారు 200 సిటీల్లో జియో మార్ట్ డెలివరీలను ప్రారంభించింది. రిలయన్స్ రీటైల్ గ్రాసరీ బిజినెస్ సీఈవో దామోదర్ మాల్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. జియో మార్ట్ లాంచ్ గురించి స్పందించడానికి రిలయన్స్ ప్రతినిధి నిరాకరించారు. జియో మార్ట్ సాఫ్ట్ లాంచ్ ద్వారా అమెజాన్ డాట్ కమ్, ఫ్లిప్ కార్ట్ కు రిలియన్స్ సవాల్ విసిరింది. 2027వ సంవత్సరానికి ఈ–కామర్స్ మార్కెట్స్ 200 బిలియన్ డాలర్లకు పెరిగే చాన్సెస్ ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ లో కూడా జియో మార్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇండియాలో వాట్సాప్ కు 400 మిలియన్ల యూజర్లు ఉన్న సంగతి తెలిసిందే. జియో మార్ట్ సేవలు అందించడం ద్వారా కస్టమర్స్ కు వాట్సాప్ తో చిన్నపాటి బిజినెస్ కనెక్షన్ ఏర్పడుతుందని ఫేస్ బుక్ భావిస్తోంది. కాగా, న్యూయార్క్ బేస్డ్ గా కార్యకలాపాలు నిర్వహించే కేకేఆర్ అండ్ కోడాట్ అనే కంపెనీ తాజాగా జియో ప్లాట్ ఫామ్స్ లో పెట్టుబడులు పెట్టింది. 113.7 బిలియన్ రూపాయల (1.5 బిలియన్స్)ను చెల్లించడం ద్వారా జియోలో 2.3 శాతం స్టేక్స్ ను కేకేఆర్ సొంతం చేసుకుంది. పెట్రో కెమికల్స్ బిజెనెస్ నుంచి వేగంగా వృద్ధి చెందుతున్న కన్జూమర్ బిజినెస్ వైపు రిలయన్స్ వడివడిగా అడుగులు వేస్తోందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.