జియోబుక్​@ రూ. 16,500

జియోబుక్​@ రూ. 16,500

రిలయన్స్​  రిటైల్​  జియో బుక్​ పేరుతో లెర్నింగ్ ​బుక్​ను లాంచ్​ చేసింది. అత్యాధునిక ఆపరేటింగ్ సిస్టమ్ -జియో ఓఎస్​, 4జీ,  డ్యూయల్ -బ్యాండ్  వైఫై కనెక్టివిటీ, అల్ట్రా స్లిమ్ (990 గ్రాములు) డిజైన్, ఆక్టా-కోర్ చిప్‌‌‌‌సెట్, 11.6 ఇంచుల యాంటీ గ్లేర్  హెచ్​డీ డిస్​ప్లే, యూఎస్​బీ, హెచ్​డీఎంఐ, ఆడియో పోర్టులు, వైర్లెస్ ప్రింటింగ్, మల్టీ టాస్కింగ్ స్క్రీన్‌‌‌‌లు, ఇంటిగ్రేటెడ్  చాట్‌‌‌‌బాట్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. జియో టీవీ యాప్ ద్వారా ఎడ్యుకేషనల్ కంటెంట్‌‌‌‌ పొందవచ్చు. జియో  క్లౌడ్ ​ గేమ్స్ ​ద్వారా ఆటలు ఆడుకోవచ్చు. ఇందులో 4జీ ర్యామ్​, 65 జీబీ స్టోరేజీ ఉంటాయి. ధర రూ.16,500. వచ్చే నెల ఐదు నుంచి అమ్మకాలు మొదలవుతాయి.