ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ ఆంక్షలు

ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ ఆంక్షలు

ఎగ్జిట్ పోల్స్ పై ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం. మే 19 సాయంత్రం లోక్ సభ తుది విడత పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయాలని స్పష్టం చేసింది. మీడియాతో పాటు.. మొదటిసారిగా వెబ్ సైట్లు, సోషల్ మీడియాకు సూచనలు జారీచేసింది. 7 దశల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో.. ప్రతి దశపూర్తయ్యేందుకు ముందు 48 గంటల వ్యవధిలో.. ఏ పార్టీకి, అభ్యర్థికి అనుకూలమైన లేదా వ్యతిరేకమైన కార్యక్రమాలు, విజ్ఞప్తులు ప్రసారం చేయొద్దని.. టీవీ, రేడియో చానళ్లు, కేబుల్ నెట్ వర్క్స్, వెబ్ సైట్లకు ఈసీ సూచించింది. ఇందుకు సంబంధించి ప్రజా ప్రాతినిథ్య చట్టం – 1951లోని 126(ఏ) సెక్షన్ ను అమల్లోకి తెచ్చింది ఈసీ. ఈ సెక్షన్ ప్రకారం.. తుది విడత పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించటం, వాటి ఫలితాలు వెళ్లడించటం నిషిద్ధం.