
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తెలిపారు. కొత్తగూడెం క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ చెక్కులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలోని త్రీ టౌన్‌కు వెళ్లే రోడ్డు విస్తరణకు అవసరమైన ల్యాండ్‌ను రైల్వే శాఖ నుంచి ఆర్‌అండ్‌బీకి ఇప్పించేందుకు రైల్వే అధికారులతో మాట్లాడుతానన్నారు.
కొత్తగూడెంలో రైల్వే శాఖ ఆర్ అండ్ బీ కి ల్యాండ్ ఇస్తే ఖమ్మంలోని రెవెన్యూ ల్యాండ్‌ను తమకు ఇవ్వాలని రైల్వే శాఖ అడుగుతోందన్నారు. ఈ విషయమై ఆఫీసర్లతో డిస్కస్ చేస్తానన్నారు. పాల్వంచలోని స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని తిరిగి తెరిపించేందుకు ఉన్నతాధికారులతో చర్చిస్తానన్నారు. కేటీపీఎస్ మరో ప్లాంట్‌కు కృషి చేస్తానన్నారు. ఏపీలో కలిసి ఐదు మండలాలను తిరిగి తెలంగాణలో కలిసేలా కేంద్రం పరిశీలించాలన్నారు. ఐదు మండలాలను ఏపీలో కలిపిన టైంలోనూ తాను పోరాటాలు చేశానన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపడం లేదన్నారు. మహిళలకు పెద్ద పీట వేస్తోందన్నారు.
ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ధ్యేయం
పాల్వంచ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని రేణుకా చౌదరి అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ కర్మా గారంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఇతర అధికారులతో మాట్లాడారు. కేటీపీఎ స్ కు అనుబంధంగా మరో సూప ర్ క్రిటికల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రావాలంటే ఎటువంటి కార్యా చరణ చేయాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థానికంగా అన్ని వనరులు ఉన్న నేపథ్యంలో కేటీపీఎస్ 8వ దశ సాధించి తీరుతామన్నారు. స్థానిక ఎన్ఎం డీసీలో ఉత్పత్తిని పునరుద్ధరిం చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అనంతరం ఇటీవల మృతి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పైడిపల్లి మనోహర్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానిక బంజారా భవన్ లో నిర్వహించి న సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్ర మాల్లో టీపీసీసీ కార్యదర్శి నాగా సీతారాములు, రాష్ట్ర నాయకు లు ఎడవల్లి కృష్ణ, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఏ జలీల్, జెన్కో ఐఎన్టీయూసీ అధ్యక్షులు మజీద్, ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యదర్శి మంగీలాల్, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఎల్డీఎం బద్ది కిశోర్, కేటీపీ ఎస్ 7వదశ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస బాబు, ఎస్ ఈ యుగపతి పాల్గొన్నారు.