
న్యూఢిల్లీ:బజాజ్ ఫైనాన్స్ తన రెండు లెండింగ్ ప్రొడక్టుల కింద లోన్లు ఇవ్వకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ఆదేశించింది. ఈ నిషేధాన్ని తక్షణమే అమలులోకి తీసుకురావాలని కోరింది. ఈ–కామ్, ఇన్స్టా ఈఎంఐ కార్డుల లోన్లపై రిస్ట్రిక్షన్లను పెట్టింది. ఆర్బీఐ డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలు, ప్రస్తుత నిబంధనలకు కట్టుబడి ఉండకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రొడక్టుల గురించి కస్టమర్లకు బజాజ్ ఫైనాన్స్ వాస్తవ ప్రకటనలను జారీ చేయలేదని అభ్యంతరం తెలిపింది.