రెండేండ్ల కనిష్టానికి రిటైల్ ఇన్​ఫ్లేషన్

రెండేండ్ల కనిష్టానికి రిటైల్ ఇన్​ఫ్లేషన్
  • మే నెలలో 4.25 శాతంగా నమోదు

రిటైల్ ఇన్​ఫ్లేషన్ (ధరల పెరుగుదల) ఈ ఏడాది​ మే నెలలో 25 నెలల కనిష్ట స్థాయి 4.25 శాతానికి తగ్గింది. ప్రధానంగా ఆహారం, ఇంధనం ధరలు తగ్గాయి.     ​

న్యూఢిల్లీ:  రిటైల్ ఇన్​ఫ్లేషన్ (ధరల పెరుగుదల) ఈ ఏడాది​ మే నెలలో 25 నెలల కనిష్ట స్థాయి 4.25 శాతానికి తగ్గింది. ప్రధానంగా ఆహారం, ఇంధనం ధరలు తగ్గాయి.  వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఇన్​ఫ్లేషన్ గత ఏడాది​ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 4.7 శాతం ఉండగా, గత మే నెలలో 7.04 శాతంగా ఉంది. రిటైల్ ఇన్​ఫ్లేషన్​ తగ్గడం ఇది వరుసగా నాలుగో నెల.  వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత  ఇన్​ఫ్లేషన్​ ఆర్​బీఐ  కంఫర్ట్ జోన్‌‌‌‌‌‌‌‌లో 6 శాతం కంటే తక్కువగా ఉండడం వరుసగా మూడో నెల. 2021 ఏప్రిల్​ తరువాత ఇది ఇంత తక్కువగా ఉండటం తొలిసారి. అప్పుడు సీపీఐ రిటైల్​ ఇన్​ఫ్లేషన్​ 4.23 శాతంగా ఉంది. రిటైల్ ఇన్​ఫ్లేషన్​ ఇరువైపులా 2 శాతం మార్జిన్‌‌‌‌‌‌‌‌తో 4 శాతం వద్ద ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆర్​బీఐని కోరింది. ఆహార ఇన్​ఫ్లేషన్​ మే నెలలో 2.91 శాతంగా ఉంది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 3.84 శాతం కంటే తక్కువగా ఉంది. సీపీఐలో దాదాపు సగం ఫుడ్ సెగ్మెంట్​ నుంచే ఉంటుంది. ఇంధనం, లైట్ ఇన్​ఫ్లేషన్​ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 5.52 శాతం నుండి 4.64 శాతానికి తగ్గింది. ఆర్​బీఐ గత వారం పాలసీ రేట్లను 6.5 శాతంగా (మార్చలేదు) ఉంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సగటు రిటైల్ ఇన్​ఫ్లేషన్​ 5.1 శాతం ఉండొచ్చని అంచనా వేసింది.

4.2 శాతం పెరిగిన ఐఐపీ

మాన్యుఫాక్చరింగ్​, మైనింగ్​ సెక్టార్లలో వృద్ధి వల్ల ఈ ఏడాది ఏప్రిల్​లో ఇండెక్స్​ ఆఫ్ ​ఇండస్ట్రియల్​ ప్రొడక్షన్​ (ఐఐపీ) 4.2 శాతం పెరిగింది. ఇదే ఏడాది మార్చిలో ఐఐపీ 1.7 శాతమే ఉంది. గత ఏప్రిల్​లో 6.7 శాతం ఉంది. ఈసారి మానుఫ్యాక్చరింగ్​ సెక్టార్​ అవుట్​పుట్​ 4.9 శాతం పెరగగా, పవర్​ జెనరేషన్​ సెక్టార్​ అవుట్​పుట్​ 1.1 శాతం తగ్గింది. మైనింగ్​ అవుట్​పుట్​ 5.1 శాతం పెరిగింది. క్యాపిటల్​ గూడ్స్​ సెగ్మెంట్ 6.2 శాతం ఎగిసిందని నేషనల్ స్టాస్టిక్స్​ ఆఫీస్ తెలిపింది.