తినొచ్చు..కొనొచ్చు: ఢిల్లీలో రిటైల్ రెస్టారెంట్

తినొచ్చు..కొనొచ్చు: ఢిల్లీలో రిటైల్ రెస్టారెంట్

హోటల్‌‌‌‌‌‌‌‌కు వెళ్తే ఏం చేస్తాం.. మనక్కావాల్సింది ఆర్డర్‌‌‌‌‌‌‌‌ చేస్తాం..తింటాం .. బిల్లు కట్టేసి వస్తాం.. కానీ ఈ హోటల్‌‌‌‌‌‌‌‌లో తినడమే కాదు.. కొనుక్కోవచ్చు కూడా.. నిజం.. మీరు తింటున్న ప్లేట్‌‌‌‌‌‌‌‌ గానీ.. తాగిన బాటిల్‌‌‌‌‌‌‌‌ గానీ.. కూర్చున్నసోఫా గానీ.. అక్కడ చూసిందేదైనా కొనుక్కోవచ్చు.. హోటల్‌‌‌‌‌‌‌‌లోని వస్తువులను శాంపిల్‌‌‌‌‌‌‌‌గా సర్వ్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటారు.. ఢిల్లీలో తొలిసారి ఇలాంటి ‘రిటైల్‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌’ ప్రారంభమైంది. నచ్చితే ఆర్డర్‌‌‌‌‌‌‌‌ చేసి కొనుక్కోవచ్చు. ఢిల్లీలో తొలిసారి అయినా దేశవ్యాప్తంగా రెండోది. రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌ పేరు బెంట్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌. మొదటిది ముంబైలో యర్‌‌‌‌‌‌‌‌ పరేల్‌‌‌‌‌‌‌ లో గతేడాది మొదలైంది. మూడో బ్రాంచీని ఐటీ సిటీ బెంగళూరులో ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. సీజన్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌ను మారుస్తుంటా రు. కొలరాడలోని డెన్వర్‌‌‌‌‌‌‌‌ కన్వె న్ష న్‌‌‌‌‌‌‌‌సెం టర్‌‌‌‌‌‌‌లో పేద్ద నీలిరంగు ఎలుగుబంటిని సృష్టించిన అమెరికన్‌‌‌‌‌‌‌‌ శిల్పి లారెన్స్‌‌‌‌‌‌‌‌ అర్జెంట్‌‌‌‌‌‌‌కు గుర్తుగా రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌ ముందు ఓ చిన్న ప్లమ్మీ ఎలుగును పెట్టారు.రెస్టారెంట్‌‌‌‌‌‌‌లో మూడు రకాల సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలున్నాయి. ఓ బారు కూడా ఉంది. సీఫుడ్‌ వొంటన్స్‌‌‌‌‌‌‌‌, కాలిఫోర్నియా ఉరమకి, స్పైసీ బార్బేక్యూచికెన్‌‌‌‌‌‌‌‌ బావో, మంగోలియన్‌‌‌‌‌‌‌ ‌స్లైస్డ్‌‌ లాంబ్‌ లాంటి వంటకాలు స్పెషల్‌‌‌‌‌‌‌‌. భోజనం తర్వాత ఇచ్చే తీపి పదార్థాలు ఉన్నాయండోయ్‌ . రెస్టారెంట్‌‌‌‌‌‌‌లో ఇద్దరి భోజనానికయ్యే ఖర్చు జస్ట్‌‌‌‌‌‌‌‌ రూ.2,500.