పెరిగిన వెహికల్స్​ రిటెయిల్​ అమ్మకాలు

పెరిగిన వెహికల్స్​ రిటెయిల్​ అమ్మకాలు

2022 లో 15 శాతం గ్రోత్​తో 2.11 కోట్లకు చేరినయ్​

న్యూఢిల్లీ: కిందటేడాది అంటే 2022లో దేశంలో వెహికల్స్​ రిటెయిల్​ అమ్మకాలు 15.28 శాతం పెరిగి 2,11,20,441 యూనిట్లకు చేరాయి. ఈ కాలంలో పాసింజర్​ వెహికల్స్​, ట్రాక్టర్ల సేల్స్​ రికార్డు లెవెల్​కి చేరినట్లు ఫెడరేషన్​ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (ఫాడా) గురువారం వెల్లడించింది. అంతకు ముందు ఏడాది 2021లో దేశంలో మొత్తంగా వెహికల్స్​ రిటెయిల్​ సేల్స్​ 1,83,21,760 యూనిట్లని పేర్కొంది. 2022లో టూవీలర్ల అమ్మకాలు 13.37 శాతం ఎక్కువై 1,53,88,062 యూనిట్లకు చేరాయని వివరించింది. 2021లో టూ వీలర్ల అమ్మకాలు 1,35,73,682 యూనిట్లు. పాసింజర్​ వెహికల్స్​ (కార్లు) సేల్స్​ 2022లో 16.35 శాతం ఎగసి 34,31,497 యూనిట్లయినట్లు ఫాడా డేటా చెబుతోంది. మొత్తం వెహికల్స్​ అమ్మకాలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం, 2020 తో పోలిస్తే 17 శాతం పెరిగినప్పటికీ 2019 (ప్రీ కొవిడ్) లెవెల్​ను మాత్రం అందుకోలేకపోయినట్లు ఫాడా ప్రెసిడెంట్​ మనీష్​ రాజ్​ సింఘానియా చెప్పారు. ఆ ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 10 శాతం తగ్గాయని పేర్కొన్నారు.  కార్ల అమ్మకాలు మాత్రం 2022 లో  జోరందుకున్నాయని వెల్లడించారు.  దేశంలో ఇప్పటిదాకా నమోదయిన అత్యధిక అమ్మకాలు ఈ ఏడాదివేనని పేర్కొన్నారు. డిసెంబర్​ 2022లో టూ వీలర్ల అమ్మకాలు తగ్గి, నిరుత్సాహపరిచాయని వాపోయారు. అంతకు ముందు రెండు నెలలూ వాటి సేల్స్​ పెరిగాయని అన్నారు. 

రికార్డు లెవెల్​కి  ట్రాక్టర్ల సేల్స్​...

ఇన్​ఫ్లేషన్​ పెరుగుదల, ధరలు పెరగడం, రూరల్​ మార్కెట్లు ఇంకా పుంజుకోకపోవడంతోపాటు, ఎలక్ట్రిక్​ వెహికల్స్​ సేల్స్​ ఎక్కువవడం వంటి కారణాల వల్లే టూ వీలర్ల అమ్మకాలు పెరగడం లేదని మనీష్​ రాజ్​ సింఘానియా వివరించారు. 2022 లో కమర్షియల్​ వెహికల్స్ (సీవీ)​ రిటెయిల్​ సేల్స్​ 31.97 శాతం పెరిగాయని, ఈ కాలంలో మొత్తం 8,65,344 సీవీలు అమ్ముడయ్యాయని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌‌ టైములో బాగా పడిపోయిన టూ వీలర్ల అమ్మకాలు 2022లో కొంత పెరిగాయని చెప్పారు. ఎలక్ట్రిక్​ రిక్షా సెగ్మెంట్​ 2022లో ఏకంగా 50 శాతం గ్రోత్​ రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. త్రీ వీలర్ల రిటెయిల్​ సేల్స్​ భారీగా పెరిగి 6,40,559 యూనిట్లకు చేరాయని అన్నారు.