లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై ఇంజక్షన్ గ్రాంట్: మంగళగిరి కోర్ట్

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై ఇంజక్షన్ గ్రాంట్: మంగళగిరి కోర్ట్

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు తిప్పలు తప్పడంలేదు. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు తెలిపినా.. ఇప్పుడు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను నిలిపివేయాలంటూ.. మంగళగిరి కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ కేసులో పిటీషన్‌ కు అనుకూలంగా గురువారం కోర్టు తీర్పు చెప్పింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై స్టే ఇచ్చింది.

ఈ సినిమా విడుదల వల్ల తమ మనోభావాలు దెబ్బతింటాయని.. ఏప్రిల్‌ 15 వరకు సినిమా విడుదలను ఆపేయాలని పిటిషనర్ కోరారు. ఈ కేసులో ప్రతివాదులుగా డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ, అగస్త్య మంజు, రాకేష్‌ రెడ్డి, దీప్తి, బాలగిరి, నరేంద్రచారి, జీవీఆర్‌, జీవీ ఫిల్మ్స్‌ ఉన్నాయి. సోషల్ మీడియా, టీవీ చానెళ్లలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్లను నిషేధించాలని కోర్టును పిటీషనర్ తరుపు లాయర్ కోరారు. అయితే మంగళగిరి ఇచ్చిన స్టేపై  ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.

ఏప్రిల్ 3వ తేదీ వరకు సినిమా విడుదల నిలిపివేసిన ఏపీ హైకోర్టు. ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 4గంటలకు హైకోర్టు జడ్జి చాంబర్లో న్యాయవాదుల సమక్షంలో చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న హైకోర్టు.