
మనీ ల్యాండర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తికి సంబంధించిన ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియా టుడే కథనం ప్రకారం ..సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేశారు.తన కుమారుడికి చెందిన పలు బ్యాంకుల్లో సుమారు రూ.15కోట్లు మాయామైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేకేసింగ్ ఫిర్యాదుతో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో రియా చక్రవర్తి ఆదాయం 10 నుంచి 14లక్షలకు పెరిగినట్లు తెలుస్తోంది.
1. ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) రికార్డుల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా రియా చక్రవర్తి నికర ఆస్తి విలువ రూ .10 లక్షల నుంచి 12 లక్షలకు, ఆపై రూ .14 లక్షలకు పెరిగినట్లు ఇండియా టుడే తన కథనంలో తెలిపింది.
2. తక్కువ నికర విలువ ఉన్నప్పటికీ, రియా ముంబైలో రెండు ఆస్తులను కొనుగోలు చేసింది.
3. అందులో ఒక ప్రాపర్టి రియాపేరుతో ఉండగా, మరో ప్రాపర్టి ఆమె కుటుంబ సభ్యుల పేరుతో ఉంది. ఆ ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు పెద్దమొత్తంలో నగదు ఎవరు ఇచ్చారో తెలియాల్సి ఉంది.
4. ఈడీ అధికారులు రియా ఆస్థులకు చెందిన పత్రాల్ని ఆమె కుటుంబసభ్యుల నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
5. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన రెండు కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఢిల్లీకి చెందిన మరో సంస్థలో సోదాలు జరపాల్సి ఉంది.
6. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆస్థులు మరియు కేసుకు సంబంధించి ఆయన సీఏ ఇచ్చిన సమాధానాలకు ఈడీ అధికారులు సంతృప్తి చెందలేదని సమాచారం.
7. ఈడీ అధికారులు రియాకు మెయిల్ ద్వారా నోటీసులు జారీ చేశారు. కానీ ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు.