
ఆగి ఉన్న ట్రక్ ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం అసోంలోని ఉదల్‌గురి జిల్లా నేషనల్ హైవే 15పై బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను హాస్పిటల్ కు తరలించారు. కారులో ఉన్న వారంతా పెండ్లికి వెళ్లి రిటర్న్ అవగా దారి మధ్యలో ప్రమాదం జరిగిందని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు పోలీసులు.
Assam: 8 persons dead in a road accident on National Highway-15 in Orang area of Udalguri district. pic.twitter.com/96AT2voeyS
— ANI (@ANI) November 20, 2019