మెట్‎పల్లి శివారులో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

మెట్‎పల్లి శివారులో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

జగిత్యాల జిల్లా మెట్‎పల్లి శివారులోని ఆరపేట బస్టాండ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్‎పల్లి నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ఓ చిన్నారిని ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. 

కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.