ఉత్తరాఖండ్ లో లోయలో పడిన బస్సు : 17 మంది మృతి

ఉత్తరాఖండ్ లో లోయలో పడిన బస్సు : 17 మంది మృతి

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు దుమ్టాలో యమునోత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది యాత్రికులు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎస్ డీఆర్ ఎఫ్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన యాత్రికులు యమునోత్రికి  వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

 

ప్రమాదం గురించి తెలియగానే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్నారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించడంతో పాటు సహాయ, సహాయక చర్యలను త్వరితగతిన చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. 

రోడ్డు ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. తమ అధికారుల బృందం ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉందని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.

మరిన్ని వార్తల కోసం..

F3 'ఫన్'టాస్టిక్..రూ.100 కోట్ల సెలబ్రేషన్స్‌

వీరి కొట్లాటలోకి కొత్తగా మరొకరు