MI vs RR: హార్దిక్‍ను ఏమీ అనకండి.. అభిమానులకు రోహిత్ రిక్వెస్ట్

MI vs RR: హార్దిక్‍ను ఏమీ అనకండి.. అభిమానులకు రోహిత్ రిక్వెస్ట్

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత హార్దిక్ పాండ్య కష్టాలు ఎక్కువయ్యాయి. ఓ వైపు ముంబై ఫ్యాన్స్ ట్రోలింగ్.. మరోవైపు జట్టు వరుస ఓటములు..ఇంకోవైపు వ్యక్తిగత వైఫల్యం ఇళ్ల చెప్పుకుంటూ పోతే పాండ్యకు ఈ సీజన్ అసలు కలిసి రావడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ హార్దిక్ ను టార్గెట్ చేశారు. అతను ఎక్కడికి వెళ్లినా వదలట్లేదు. తొలి రెండు మ్యాచ్ లకు టాస్ సమయంలో రోహిత్ రోహిత్ అంటూ నినాదాలు చేసిన ఫ్యాన్స్ .. నిన్న (ఏప్రిల్ 1) వాంఖడేలో మరింతగా రెచ్చిపోయారు.

టాస్ వేస్తున్నప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఎప్పటిలాగే ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అతను మాట్లాడుతున్న సమయంలో రోహిత్, రోహిత్ అంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ దశలో సంజయ్ మంజ్రేకర్ దయచేసి హార్దిక్ ను గౌరవించండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇక మ్యాచ్ సమయంలోనూ ఈ గోల తగ్గలేదు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంకా ఎక్కువైంది. పాండ్యాను అవమానిస్తూ బూ..అన్నారు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ కలుగజేసుకున్నాడు.

Also Read: గ్రౌండ్‌లోకి అభిమాని.. భయంతో పరుగులు పెట్టిన రోహిత్
 
పాండ్యను ఏమనకండి అంటూ ఫ్యాన్స్ వైపు చేతులు చూపిస్తూ సైగలు చేశాడు. రోహిత్ సైగలు చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు నెటిజన్స్ హిట్ మ్యాన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో మొదటి బంతికే ఔటయ్యాడు. హిట్ మ్యాన్ తో బ్యాటర్లంటారూ ఘోరంగా విఫలమవడంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 125 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 4 కోల్పోయి 15.3 ఓవర్లలో టార్గెట్ ను ఛేజ్ చేసింది.