ఏఐతో అందుబాటులోకి మరిన్ని ఉద్యోగాలు : రోహిత్   టాండన్‌‌‌‌

ఏఐతో అందుబాటులోకి మరిన్ని ఉద్యోగాలు : రోహిత్   టాండన్‌‌‌‌

న్యూఢిల్లీ: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో కొన్ని రకాల జాబ్‌‌‌‌ రోల్స్‌‌‌‌ పోయినా, కొత్త జాబ్‌‌‌‌లు క్రియేట్ అవుతాయని డెలాయిట్ ఏఐ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ రోహిత్  టాండన్ పేర్కొన్నారు. మనుషులను ఏఐ భర్తీ చేయలేదని అన్నారు. ఏఐ–మనుషులు కొలబరేషన్ కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.

ఐటీ, టెక్నాలజీ, కంప్యూటర్ వంటివి అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా కొన్ని రకాల జాబ్‌‌‌‌ రోల్స్‌‌‌‌ కనిపించకుండా పోయాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఐటీతో గ్లోబల్‌‌‌‌గా ఎన్ని జాబ్‌‌‌‌లు క్రియేట్ అయ్యాయో చూడాలని పేర్కొన్నారు. భవిష్యత్‌‌‌‌లో యూజర్ల కంప్యూటర్లు, ఫోన్లలో పవర్‌‌‌‌‌‌‌‌పుల్ ఏఐ టూల్స్ అందుబాటులో ఉంటాయని రోహిత్ అన్నారు.