ఫలించిన ఎదురు చూపులు.. మిడ్ మానేర్ నిర్వాసితులకు రూ.10.26 కోట్ల పరిహారం విడుదల

ఫలించిన ఎదురు చూపులు.. మిడ్ మానేర్ నిర్వాసితులకు రూ.10.26 కోట్ల పరిహారం విడుదల

బోయినపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మాన్వాడలో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు)  ప్రాజెక్టు నిర్వాసితుల ఎదురుచూపులు ఫలించాయి. కోనేండ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితుల నిరీక్షణకు తెరపడింది.

రాష్ట్ర ప్రభుత్వ పరిహారం నిధులను నిర్వాసితుల ఖాతాల్లో అధికారులు సోమవారం జమ చేశారు. గతంలో పరిహారం చెల్లించిగా మిగిలిన ముంపు గ్రామాల్లోని 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు చిన్న చిన్న కారణాలతో నిలిచిపోయిన ప్యాకేజీ పరిహారాన్ని అధికారులు జమ చేశారు.

అలాగే మాన్వాడ గ్రామానికి చెందిన పెండింగ్ లో ఉన్న 22 మందికి కూడా రూ. 51 లక్షల  పరిహారాన్ని జమ చేశారు. మొత్తంగా రూ. 10.26  కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల ఐక్యవేదిక అధ్యక్షుడు కూస రవీందర్ తెలిపారు. నిర్వాసితులకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రూ.5.04 లక్షలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.