నార్కట్​పల్లిలో వాహన తనిఖీల్లో రూ.12 లక్షల పట్టివేత

నార్కట్​పల్లిలో వాహన తనిఖీల్లో రూ.12 లక్షల పట్టివేత

నార్కట్​పల్లి, వెలుగు : లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో నార్కట్​పల్లి పరిధిలో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.9.50 లక్షల నగదు తీసుకెళ్తున్న ఒక వ్యక్తి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేయగా, రూ.2.39 లక్షలు పట్టుకున్నారు. ఈ డబ్బును డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ నల్గొండకు తరలించినట్లు ఎస్సైలు అంతిరెడ్డి, సైదాబాబు తెలిపారు.