మాస్కులు ధరించకుంటే రూ.2వేలు జరిమానా

మాస్కులు ధరించకుంటే రూ.2వేలు జరిమానా

ప్రస్తుత సమయంలో కరోనా వ్యాప్తిని నివారించాలంటే కఠిణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కరోనా వ్యాప్తిపట్ల ఆందోళన వ్యక్తం చేసిన కేజ్రీవాల్… అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అన్ని పార్టీల నాయకులతో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి మాస్కులు ధరించకుంటే  రూ.2వేల రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్నా…ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాదు చాలా మంది మాస్కులు కూడా ధరించడం లేదని, దీనికోసం జరిమానాను రూ.5వందల రూపాయల నుంచి రూ.2 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు సీఎం కేజ్రీవాల్.

కరోనా కారణంగా ఈ ఏడాది చట్ పూజా ఇంట్లో నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చట్ పూజ కారణంగా కరోనా వ్యాప్తించేందే అవకాశం ఉందని  ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సీఎం. ఢిల్లీలో కరోనా వ్యాప్తి నివారణకు ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా, మార్కెట్లలో మాస్కులు పంచాలని సూచించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి… ప్రభుత్వానికి ప్రజలు సహాకరించాలని కోరారు సీఎం కేజ్రీవాల్ .