ఒమిక్రాన్‌ అలర్ట్: RTPCR పరీక్షలు తప్పనిసరి

ఒమిక్రాన్‌ అలర్ట్: RTPCR పరీక్షలు తప్పనిసరి

న్యూఢిల్లీ: దేశంలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడటంతో కేంద్ర వైద్యారోగ్యశాఖ అలర్ట్ అయింది. బెంగళూరులోనే ఈ రెండు కేసులు నమోదయ్యాయని చెప్పిన కేంద్ర ఆరోగ్యశాఖ..  ఒమిక్రాన్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపింది. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడంతో పాటు, రెండు డోసుల టీకా తీసుకోవాలని సూచించింది. జీనోమ్‌ సీక్వెన్సింగ్ కోసం 37 ప్రయోగశాలలు ఏర్పాటు చేసినట్లు చెప్పింది. ఒమిక్రాన్‌ ఉన్న దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరని..పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారి చికిత్సకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. కర్ణాటకలో గుర్తించిన రెండు కేసుల్లో ఒమిక్రాన్‌ తీవ్ర లక్షణాలు కనిపించలేదని, ప్రస్తుతం వారి కాంటాక్టులను గుర్తిస్తున్నామని తెలిపింది కేంద్ర వైద్యారోగ్యశాఖ.