Ukraine-Russia War: రష్యన్ బాంబర్ను కూల్చిన ఉక్రెయిన్ సైన్యం..

Ukraine-Russia War: రష్యన్ బాంబర్ను కూల్చిన ఉక్రెయిన్ సైన్యం..

రష్యా ఉక్రెయిన్ మధ్య రెండేళ్లుగా యుద్దం కొనసాగుతోంది. ఇందులో లక్షల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ లో చొరబడిన రష్యా దళాలు ఆ దేశంలోని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకున్నాయి. అంతర్జాతీయంగా ఎన్ని దౌత్యపరమైన చర్యలు చేపట్టిన యుద్ద కీలలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఉక్రేనియన్ లక్ష్యాలపై రష్యా క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించేందుకు పంపిన బాంబర్ ను  శుక్రవారం (ఏప్రిల్ 19) ఉక్రెయిన్ దళాలు కూల్చి వేశాయి.ఇది అణు వార్ హెడ్ లను కూడా మోసుకెళ్లే కెపాసిటీ కలిగిన బాంబర్. 

రష్యన్ బాంబర్ ఉక్రెయిన్ లో కూలిపోతున్నపుడు ఆకాశంలో టెయిల్ స్పిన్ లోకి వెళ్తున్న దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టావ్రో పోల్ లోని పొలాల్లో రష్యన్ బాంబర్ కూలిపోయింది. 

ఉక్రేనియన్ వైమానిక దళం శ్రతు సేనకు చెందిన Tu-2M3 బాంబర్ ను కూల్చివేసింది. ఇది రష్యా ఉక్రేనేయన్ నగరాలపై దాడి చేయడానికి ఉపయోగించిదని.. దీని మా సైన్యం విజయవంతంగా తిప్పికొట్టిందని..ఇప్పటివరకు 29 వైమానిక క్షిపణులు కూల్చివేసిందని ఉక్రెయిన్ మంంత్రిత్వ శాఖ Xలో పేర్కొంది. 

అయితే దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. స్టావ్రోపోల్ ప్రాంతంలో యుద్ద మిషన్ పూర్తి  చేసి తర్వాత బాంబర్ కూలిపోయిందని, విమానంలో ఎటు వంటి ఆయుధ సామాగ్రి లేదని , ఎటువంటి నష్టం జరగలేదని మీడియా ద్వారా ప్రకటించింది. 
 
2022 ఫిబ్రవరి24న, రష్యా ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున యుద్ధం ప్రారంభించింది. ఇది 2014 నుంచి కొనసాగుతున్న రష్యా,ఉక్రెయిన్ యుద్ధం 2022లో తీవ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. NATOలో చేరకుండా ఉక్రెయిన్‌ను చట్టబద్ధంగా నిషేధించాలని రష్యా డిమాండ్ చేసింది.

రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు ఎక్కడా కనిపించడం లేదు. ఈ యుద్ధంలో లక్షల్లో ఉక్రేనియన్లు చనిపోయారు. మిలియన్ల కొద్ది ఉక్రేనియన్లు దేశం విడిచి పోయారు. యూరప్ భౌగోళిక  రాజకీయ దృశ్యాన్ని మార్చింది. దేశాల మధ్య పరస్పర సహకారం లోపించింది. ద్రవ్యోల్భణం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. 

యుద్దం మొదలైన మొదట్లో రష్యా ఉక్రెయిన్ ను త్వరలోనే స్వాధీనం పర్చుకుంటుందని ప్రపంచమంతా ఊహించింది. రష్యా పూర్తి స్థాయిలో దండయాత్ర చేస్తే.. ఉక్రెయిన్ 72 గంటల్లో కూలిపోతుందని ఫిబ్రవరి 2022 ప్రారంభంలో అప్పటి యునైటెడ్ స్టేట్స్ జాయింట్ చీఫ్స్ ఆప్ స్టాప్ చైర్మన్ జనరల్ మార్క్  మిల్లీ జోస్యం చెప్పారు. కానీ రెండేళ్లుగా రష్యన్ దళాలను ఉక్రేనియన్లు బేవద్దనే ఉంచారు. ధృడ సంకల్పంతో తమ దేశాన్ని రక్షించుకుంటున్నారు.