
శాక్రిఫైజ్ స్టార్ సునిషిత్ అరెస్ట్ అయ్యాడు. యూట్యూబ్ ఛానెల్ పబ్లిసిటీ కోసం ప్రముఖ హీరో,హీరోయిన్స్ , పోలీసులను పరుషు పదజాలంతో దూషిస్తున్న సునిషిత్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి ఆర్ఎల్ నగర్ లో నివాసం ఉండే సునిషిత్ తనని తాను ఫిల్మింస్టార్ అని గొప్పలు చెప్పుకుంటుండేవాడు. అంతేకాదు ఆఫేమ్ తో యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ..హీరోలు, హీరోయిన్ లను, పోలీసులపై ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసేవాడు.
ఈ నేపథ్యంలో పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తాజాగా సునిషిత్ ను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సి ఐ తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడి మీద గతంలో పలు కేసులు నమోదయ్యాయయని అన్నారు. అతని కుటుంబసభ్యుల్ని విచారించగా అతని మానసిక స్థితిబాగుందన్నారు.
పేరు కోసం యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని, ఫేమ్ కోసం ఇష్టవచ్చినట్లు మాట్లాడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని అన్నారు. ఫిర్యాదుతో నిందితుడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు కీసర పోలీసులు తెలిపారు.