బండ్లకు బాగానే పెరిగిన డిమాండ్..

బండ్లకు బాగానే పెరిగిన డిమాండ్..

న్యూఢిల్లీ: రూరల్ డిమాండ్ బలంగా ఉండటం.. అర్బన్ మార్కెట్లు కోలుకోవడంతో ఆటో సేల్స్ నవంబర్‌‌‌‌లో పెరిగాయి. దాదాపు అన్ని కంపెనీలు కిందటేడాది కంటే మెరుగైన సేల్స్‌‌ను రిపోర్ట్ చేశాయి. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకి నుంచి కొత్తగా మన మార్కెట్‌‌లోకి వచ్చిన కియా మోటార్స్ వరకు అన్నింటికీ మంచి అమ్మకాలు జరిగాయి. కరోనా అవుట్‌‌బ్రేక్‌‌తో పర్సనల్ మొబిలిటీ వైపుకి జనాలు ఆసక్తి చూపుతుండటంతో ఆటో సేల్స్ పెరిగినట్టు కంపెనీలు చెబుతున్నాయి.

మారుతీ సుజుకి కారు సేల్స్…

దేశంలో అతిపెద్ద కారు తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఇండియా(ఎంఎస్‌‌ఐ) సేల్స్ నవంబర్‌‌‌‌లో 1.7 శాతం పెరిగి 1,53,223 యూనిట్లుగా రికార్డు అయ్యాయి. కిందటేడాది ఇదే నెలలో కంపెనీ 1,50,630 యూనిట్ల వెహికల్స్‌‌ను అమ్మింది. దేశీయంగా గత నెలలో 1,44,219 వెహికల్స్ అమ్మినట్టు మారుతీ సుజుకి వెల్లడించింది. ఎక్స్‌‌పోర్ట్స్ 29.7 శాతం పెరిగి 9,004 యూనిట్లుగా రికార్డైనట్టు చెప్పింది. అయితే డొమెస్టిక్ ప్యాసెంజర్ కారు సేల్స్ మాత్రం 2.4 శాతం తగ్గి 1.35 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. ఆల్టో, ఎస్‌‌–ప్రెస్సో వంటి మినీ కార్ల సేల్స్ 15.1 శాతం తగ్గి 22,339 యూనిట్లుగా రికార్డయ్యాయి. కిందటేడాది ఇదే నెలలో ఈ సేల్స్ 26,306 యూనిట్లుగా ఉన్నాయి. మిడ్ సైజ్ సెడాన్‌‌ సియాజ్ సేల్స్ 29.1 శాతం పెరిగాయి. కిందటేడాది 1,448 యూనిట్లను అమ్మితే.. ఈ ఏడాది నవంబర్‌‌‌‌లో 1,870 యూనిట్లను కంపెనీ విక్రయించింది. అదేవిధంగా విటారా బ్రెజా, ఎస్‌‌–క్రాస్, ఎర్టిగా వంటి కంపెనీల సేల్స్ 2.4 శాతం పెరిగి 23,753 యూనిట్లుగా ఉన్నట్టు ఎంఎస్ఐ తెలిపింది.

ఎం అండ్ ఎం …

మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్‌‌లో ప్యాసెంజర్ వెహికల్ సెగ్మెంట్‌‌లో 24 శాతం గ్రోత్‌‌ను రికార్డు చేసింది. నవంబర్‌‌‌‌లో 18,212 యూనిట్లను అమ్మింది. కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్‌‌లో కంపెనీ సేల్స్ 23,977 యూనిట్ల నుంచి 22,883 యూనిట్లకు తగ్గాయి. 1,636 యూనిట్లను ఇతర దేశాలకు ఎక్స్‌‌పోర్ట్ చేసింది. మొత్తంగా నవంబర్ నెలలో కంపెనీ సేల్స్ 42,731 యూనిట్లుగా ఉన్నాయి. కిందటేడాది నవంబర్‌‌‌‌తో పోలిస్తే 3.62 శాతం ఎక్కువ.  ఫార్మ్ ఎక్విప్‌‌మెంట్‌‌కు డిమాండ్ బాగుందని, రూరల్‌‌ సెంటిమెంట్ పాజిటివ్‌‌గా ఉన్నట్టు కంపెనీ చెప్పింది. రూరల్, అర్బన్ మార్కెట్ల నుంచి స్ట్రాంగ్ డిమాండ్ వచ్చినట్టు పేర్కొంది.

ఎస్కార్ట్స్…

ఫార్మ్ ఎక్విప్‌‌మెంట్ తయారీ కంపెనీ ఎస్కార్ట్స్ అగ్రి మెషినరీ ట్రాక్టర్ సేల్స్ నవంబర్‌‌‌‌లో 33 శాతం పెరిగి 10,165 యూనిట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ కిందటేడాది 7,642 యూనిట్లను అమ్మింది. దేశీయంగా ట్రాక్టర్ సేల్స్ 30.9 శాతం పెరిగి 9,662 యూనిట్లుగా ఉన్నాయి. కమోడిటీ ధరలు పెరగడంతో ఈ నెలలో ధరల పెంపు చేపట్టామని కంపెనీ చెప్పింది.

కియా మోటార్స్…

కియా మోటార్స్ సేల్స్ నవంబర్ నెలలో 50.1 శాతం పెరిగాయి. ఈ కంపెనీ 21,022 యూనిట్లను అమ్మింది. కంపెనీ కిందటేడాది నవంబర్‌‌‌‌లో 14,005 యూనిట్ల సెల్టోస్‌‌ వెహికల్స్‌‌ను విక్రయించింది. కంపాక్ట్ ఎస్‌‌యూవీ మార్కెట్‌‌ సేల్స్‌‌లో కియా మోటార్స్ డామినేట్ పొజిషన్‌‌కు వచ్చింది. గత నెలలో 11,417 యూనిట్ల సోనెట్‌‌ వెహికల్స్‌‌ను అమ్మింది. సోనెట్‌‌తో పాటు సెల్టోస్‌‌కు కూడా మంచి డిమాండే ఉన్నట్టు కంపెనీ చెప్పింది.

టయోటా కిర్లోస్కర్…

టయోటా సేల్స్ 2.4 శాతం పెరిగి 8,508 యూనిట్లుగా ఉన్నాయి. ఈ జపనీస్ ఆటో కంపెనీ కిందటేడాది నవంబర్‌‌‌‌లో 8,312 యూనిట్లను అమ్మింది. ఫెస్టివ్ డిమాండ్ పెరగడం, మార్కెట్‌‌లో కన్సాలిడేషన్, కస్టమర్లు పర్సనల్ మొబిలిటీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం సేల్స్‌‌ను పెంచినట్టు టయోటా కిర్లోస్కర్ చెప్పింది.

హ్యుండాయ్

హ్యుండాయ్ మోటార్స్ నవంబర్‌‌లో హయ్యస్ట్ ఎవర్ మంత్లీ డొమెస్టిక్ సేల్స్‌ను రిపోర్ట్‌ చేసింది. 48,800 యూనిట్ల వెహికల్స్‌ను దేశీయంగా అమ్మింది. ఇతర దేశాలకు 10,400 యూనిట్లను ఎక్స్‌పోర్ట్ చేసింది. మొత్తంగా 2020 నవంబర్‌‌లో 59,200 యూనిట్లను అమ్మినట్టు హ్యుండాయ్ మోటార్ ఇండియా రిపోర్ట్ చేసింది.

అశోక్ లేల్యాండ్..

హిందూజా గ్రూప్‌‌కు చెందిన అశోక్ లేల్యాండ్ నవంబర్‌‌‌‌లో 10,659 యూనిట్ల కమర్షియల్ వెహికల్స్‌‌ను అమ్మింది. ఇది అంతకుముందు ఏడాది 10,175 యూనిట్లనే అమ్మినట్టు రిపోర్ట్ చేసింది. డొమెస్టిక్ సేల్స్ 4 శాతం పెరిగి 9,727 యూనిట్లుగా ఉన్నాయి. హెవీ అండ్ మీడియం కమర్షియల్ వెహికల్ సేల్స్ 14 శాతం తగ్గి 5,114 యూనిట్లుగా ఉన్నట్టు కంపెనీ చెప్పింది. లైట్ వెయిట్ కమర్షియల్ వెహికల్ సేల్స్ 32 శాతం పెరిగి 5,545 యూనిట్లుగా ఉన్నాయి.

టీవీఎస్ మోటార్..

కంపెనీ మొత్తం సేల్స్ గ్రోత్ 21 శాతం పెరిగి 3,22,709 యూనిట్లుగా ఉంది. నివర్ తుఫాన్ కారణంతో ఎక్స్‌‌పోర్ట్స్‌‌కు కాస్త దెబ్బకొట్టినట్టు టీవీఎస్ మోటార్ తెలిపింది. టూవీలర్ సేల్స్ 25 శాతం పెరిగి 3,11,519 యూనిట్లుగా, ఎక్స్‌‌పోర్ట్స్ 74,074 యూనిట్లుగా, త్రీవీలర్ సేల్స్ 11,190 యూనిట్లుగా ఉన్నాయి.

ఎంజీ మోటార్..

గత నెలలో హయ్యస్ట్ ఎవర్ రిటైల్ సేల్స్‌‌ను ఎంజీ మోటార్ రిపోర్ట్ చేసింది. ఈ కంపెనీ 4,163 యూనిట్ల వెహికల్స్‌‌ను అమ్మింది. కిందటేడాది నవంబర్‌‌‌‌తో పోలిస్తే సేల్స్ 28.5 శాతం పెరిగాయి. కంపెనీ 3,426 హెక్టార్ యూనిట్లను, 627 గ్లోస్టర్‌‌‌‌ యూనిట్లను, 110 జెడ్‌‌ఎస్ ఈవీ సేల్స్‌‌ను రిపోర్ట్ చేసింది.

బజాజ్ ఆటో..

బజాజ్ ఆటో నవంబర్‌‌‌‌లో 4,22,240 యూనిట్లను అమ్మింది. కిందటేడాది నవంబర్‌‌‌‌తో పోలిస్తే ఈ సేల్స్ 5 శాతం పెరిగాయి. దేశీయంగా 1,98,933 యూనిట్లను కంపెనీ విక్రయించగా.. ఎక్స్‌‌పోర్ట్స్ 2,23,307 యూనిట్లుగా ఉన్నట్టు కంపెనీ బీఎస్‌‌ఈ ఫైలింగ్‌‌లో తెలిపింది. మొత్తం మోటార్‌‌‌‌సైకిల్ సేల్స్ 12 శాతం పెరిగి 3,84,993 యూనిట్లుగా ఉన్నాయి. కమర్షియల్ వెహికల్ సేల్స్ 38 శాతం తగ్గి 37,247 యూనిట్లుగా ఉన్నట్టు కంపెనీ రిపోర్ట్ చేసింది.