ఎలక్ట్రిక్ టూవీలర్ల సేల్స్ ట్రిపుల్‌‌‌‌

ఎలక్ట్రిక్ టూవీలర్ల సేల్స్ ట్రిపుల్‌‌‌‌

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా టూవీలర్ అమ్మకాలు 300 శాతం వరకు గ్రోత్‌‌‌‌ నమోదు చేశాయి.  20‌‌‌‌‌‌‌‌22–23 ఆర్థిక సంవత్సరంలో 7.3 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లు అమ్ముడయ్యాయి. 2021–22  లో అమ్ముడైన ఈవీ టూవీలర్లతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. రెడ్‌‌‌‌సీర్​ విడుదల చేసిన  రిపోర్ట్ ప్రకారం, ఎలక్ట్రిక్ టూవీలర్ సెగ్మెంట్‌‌‌‌లో ఓలా ఎలక్ట్రిక్‌‌‌‌ 22 శాతం మార్కెట్ షేర్‌‌‌‌‌‌‌‌తో టాప్‌‌‌‌లో కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో అయితే ఓలా మార్కెట్ వాటా ఏకంగా 30 శాతం వరకు పెరిగింది.

 ‘ ఎండ్‌‌‌‌ టూ ఎండ్ డిజిటల్ సర్వీస్‌‌‌‌లను అందించడం,  ఎక్స్‌‌‌‌పీరియెన్స్ సెంటర్లను అందుబాటులోకి తేవడం, టెక్‌‌‌‌ ఎనబుల్డ్ ప్రొడక్ట్‌‌‌‌లను అందుబాటు ధరల్లో తీసుకొస్తుండడంతో ఓలా మార్కెట్ షేర్ పెరుగుతోంది’ అని రెడ్‌‌‌‌సీర్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ వెల్లడించింది.  ఈవీ సెగ్మెంట్‌‌‌‌ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుందని తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌‌‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓలా ఎలక్ట్రిక్    బాస్‌‌‌‌ భావిష్ అగర్వాల్‌‌‌‌ పేర్కొన్నారు.  రెండు మూడు మేజర్ టెక్నాలజీలు భవిష్యత్‌‌‌‌ను నిర్ణయిస్తాయని అన్నారు. ‘ఒకటి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌  కాగా మిగిలినవి ఎనర్జీ, సెల్‌‌‌‌. వీటిలో మాకు ప్రావీణ్యం ఉంది. ఒక్కసారి ఈ టెక్నాలజీల్లో  మాస్టర్ అయ్యాక ఒక ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ క్రియేట్ చేస్తాం. దానిని బేస్ చేసుకొని వివిధ ప్రొడక్ట్ సెగ్మెంట్‌‌‌‌లను తెస్తాం.  

ఈ టెక్నాలజీల ఆధారంగా సప్లయ్‌‌‌‌ చెయిన్‌‌‌‌  ఏర్పాటు చేసుకున్నాక, మాతో ఎవరూ పోటీ పడలేరు’ అని  భావిష్ అగర్వాల్ వెల్లడించారు.  దేశ ఈవీ సెక్టార్ వేగంగా విస్తరిస్తోంది.  కంపెనీలు టెక్‌‌‌‌ ఆధారంగా బండ్లు తెస్తుండడం జనరేషన్ జెడ్‌‌‌‌, మిలినియల్స్‌‌‌‌ను ఆకర్షిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో  ప్రతీ నెల సగటున 60 వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడయ్యాయని రెడ్‌‌‌‌సీర్ రిపోర్ట్ పేర్కొంది. ఫ్యూయల్ ధరలు ఎక్కువవ్వడం, ప్రజల్లో అవగాహన పెరగడం వంటి కారణాలతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌‌‌కు డిమాండ్ పెరుగుతోందని వివరించింది. మొత్తం బండ్ల సేల్స్‌‌‌‌లో ఈవీల వాటా  వచ్చే మూడేళ్లలో 30 శాతానికి చేరుకుంటుందని, 2030 నాటికి 75 శాతానికి చేరుకుంటుందని అంచనావేసింది.