Subham OTT: సమంతకు ఎదురుదెబ్బ.. ట్విస్ట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్.. ఏం జరిగిదంటే..?

Subham OTT: సమంతకు ఎదురుదెబ్బ.. ట్విస్ట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్.. ఏం జరిగిదంటే..?

సమంత నిర్మించిన లేటెస్ట్ మూవీ శుభం. మే 9, 2025న థియేటర్లలో విడుదలైన శుభం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ హర్రర్-కామెడీ మూవీ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్స్ బాగున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పనితనం చూపెట్టలేకపోయింది.

ఈ మూవీ రూ.8 కోట్ల గ్రాస్ బ్రేక్ఈవెన్ టార్గెట్‍తో బరిలోకి దిగింది. కానీ, ఇప్పటివరకు సుమారు రూ.6కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ మూవీ రిలీజై 10 రోజులు గడుస్తుండటంతో థియేటర్స్ ఆక్యుపెన్సీ కూడా తగ్గిపోయింది. దీంతో శుభం మూవీ బ్రేక్ ఈవెన్ చేరుకోవడం దాదాపు కష్టమే. అయితే, ఈ క్రమంలో శుభం మూవీకి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ బిగ్ షాక్ ఇచ్చింది. ముందస్తు మాట్లాడుకున్న ఓటీటీ డీల్ను క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. 

శుభం ఓటీటీ:

సమంత నిర్మించిన శుభం మూవీ ఓటీటీ హక్కులను జీ5 మంచి ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. శాటిలైట్ హక్కులు కూడా జీతెలుగు ఛానలే సొంతం చేసుకుంది. ఈ మేరకు శుభం మూవీ ఒకేసారి ఓటీటీ అండ్ టీవీల్లో టెలికాస్ట్ కానుందని వార్తలొచ్చాయి. 

ALSO READ | Trailer Review: వారాహి ఆలయ భూములను మంత్రి ఆక్రమణ.. రక్షించేందుకు బరిలో ముగ్గురు మొనగాళ్లు

OTTplay ప్రకారం.. జీ5 ఓటీటీ సంస్థ సమంతకు ట్విస్ట్ ఇచ్చిందట. ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసేందుకు జీ5 నిర్ణయించుకుందని ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. ముందుగా మాట్లాడుకున్న ఓటీటీ ఒప్పందం నుంచి వెనక్కి వచ్చేందుకు జీ5 రెడీ అయినట్లు వార్తలొస్తున్నాయి. సమంతకు, జీ5 ఓటీటీ సంస్థ మధ్య సరైన డీల్ కుదర్లేదని టాక్. 

జీ5 శుభం ఓటీటీకి ధర తగ్గించి అడగడంతో సామ్ వేరే ప్లాట్‌ఫామ్‌ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఆమె ఈ ఒప్పందాన్ని వేరే ప్లాట్‌ఫామ్‌కి, బహుశా జియో హాట్‌స్టార్‌కి మార్చాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

అయితే, రీసెంట్ టైంలో జీ5 సొంతం చేసుకున్న మూవీస్ అన్నీ ఒకేసారి ఓటీటీ అండ్ టీవీల్లో వస్తున్నాయి. అందులో భాగంగా వచ్చినవే సంక్రాంతికి వస్తున్నాం, రాబిన్ హుడ్. వీటి తరహాలోనే శుభం కూడా రానుంది. అన్నీ కుదిరితే, వచ్చే నెలలోనే శుభం స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉంది.

శుభం కథ:

ఆడ‌వాళ్ల‌లో ఉండే సీరియ‌ల్ పిచ్చిపై  శుభం సినిమా సాగింది. దీనికి హార‌ర్ కామెడీని జోడించి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల సక్సెస్ అయ్యాడు. దానికితోడు ఈ కథలో ఆడవాళ్ల పరిస్థితులపై చర్చించిన విధానం ఆలోచింపజేసింది. ముస్లిం యువతి షాలిని కొండపూడి పాత్ర ఆడాళ్ల అణచివేతకు అద్దం పట్టే పాత్రలో నటించింది. బయటకు వెళ్లాలి.. బ్యూటీపార్లర్ పెట్టాలనే కోరిక ఉన్నా.. తనలోనే అణుచుకునే పాత్ర ఆలోచింపజేస్తుంది.

మరో మహిళ కొత్తగా పెళ్లై ఓ మధ్యతరగతి ఇంట్లోకి కోడలిగా వెళ్ళినప్పుడు అక్కడ తన భర్తతో, అత్తమామలతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అనేది ఉన్నతంగా ఉంది. మూడో మహిళ గృహిణి అయ్యాక పురుషాధిక్యత వల్ల ఎలాంటి దారుణ పరిస్థితులను ఎదుర్కొంది? అనే అంశం లోతుగా చర్చించిన విధానం బాగుంది.