బీఆర్ఎస్​ను పాతరెస్తేనే భవిష్యత్తు: సంపత్ కుమార్

బీఆర్ఎస్​ను  పాతరెస్తేనే భవిష్యత్తు: సంపత్ కుమార్

గద్వాల, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్  పార్టీకి పాతరేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్  పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో తిరగబడదాం తరిమికొడదాం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి చార్జ్ షీట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు.

గద్వాలలో కాంగ్రెస్  జెండా ఎగరడం ఖాయమన్నారు. అనంతరం వైఎస్సార్  చౌరస్తాలో సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పీసీసీ సెక్రటరీ విజయకుమార్, డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్  సరిత, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, శంకర్, ఇసాక్, షఫీ పాల్గొన్నారు...