బంపర్ ఆఫర్..రూ. 15 వేల బ్రాండెడ్ ఫోన్..కేవలం రూ. 9500 కే

బంపర్ ఆఫర్..రూ. 15 వేల బ్రాండెడ్ ఫోన్..కేవలం రూ. 9500 కే

కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్.  బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ F13 కు  భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 14,999 ధరకు లభించే  Samsung Galaxy F13 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 9,499లకే దొరుకుతుంది. ఫ్లిప్‌కార్ట్ లో మొబైల్ బొనాంజా సేల్ పేరుతో ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 9 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

 ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో శాంసంగ్ గెలాక్సీ F13 స్మార్ట్‌ఫోన్‌పై 36 శాతం తగ్గింపు ఆఫర్ ఇవ్వబడింది. ఈ ఫోన్ గతంలో రూ.14,999కి అమ్మబడింది. ప్రస్తుతం  ప్రకటించిన ధర ఆఫర్తో ఈ ఫోన్‌ను రూ. 9,499 కే కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు..కొన్ని  బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ను కలిగి ఉంటే తక్షణమే  రూ. 250  తగ్గింపు వర్తిస్తుంది. 

ALSO READ :ఇలా చేస్తే పదేళ్లలో కోటీశ్వరులే..

శాంసంగ్ గెలాక్సీ F13 ఫీచర్లు ఇవే..

  • శాంసంగ్ గెలాక్సీ F13  1080 x 2408 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల ఫుల్ HD ప్లస్ (FHD+) డిస్‌ప్లే
  • ఈ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
  •  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5
  •  శాంసంగ్ ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 850 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.
  •  4GB వరకు RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ 
  • 1TB వరకు మైక్రో SD కార్డ్‌కు మద్దతు
  • శాంసంగ్ గెలాక్సీ F13 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారంగా కంపెనీ యాజమాన్య వన్ UI లేయర్‌తో వస్తుంది
  • బ్యాటరీ - 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ
  •  బ్యాటరీకి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 
  • శాంసంగ్ గెలాక్సీ F13 స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ సెన్సార్ + 5MP అల్ట్రా వైడ్ లెన్స్ + 2MP డెప్త్ సెన్సార్ ట్రిపుల్ రియర్ కెమెరా సౌకర్యం
  • సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8MP సెల్ఫీ కెమెరా
  •  స్మార్ట్‌ఫోన్ LED ఫ్లాష్ లైట్ 
  •  శాంసంగ్ గెలాక్సీ F13 స్మార్ట్‌ఫోన్‌లో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, USB Type-C,3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి.