హైదరాబాద్, వెలుగు: మడత పెట్టుకోవడానికి వీలుండే స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ జెడ్ ఫ్లిప్4, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 లను శామ్‌సంగ్ లాంచ్ చేసింది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లో 3,700 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌ను, కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్ చేసుకోవచ్చని శామ్‌సంగ్ పేర్కొంది. జెడ్ ఫోల్డ్ 4 అండ్రాయిడ్ 12 వెర్షన్‌తో వస్తోంది. పెద్ద స్క్రీన్‌లకు తగ్గట్టు స్పెషల్‌గా ఆండ్రాయిడ్ వెర్షన్‌ను గూగుల్ క్రియేట్ చేసిందని శామ్‌సంగ్ పేర్కొంది.
