
జూన్ నెలలో జరిగే వివిధ టోర్నీలలో పాల్గొనేందుకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఇంగ్లండ్ వెళ్లేందుకు వీసా వచ్చింది. జూన్ 6వ తేదీన నాటింగ్‌హామ్ ఓపెన్ ప్రారంభంకానున్నది. ఆ ఈవెంట్‌లో సానియా పాల్గొనున్నది. ఆ తర్వాత జరిగే ఈవెంట్లు చాలానే ఉన్నాయి. అయితే కరోనా ఆంక్షలు కారణంగా ఆమె రెండేళ్ల కుమారుడికి మాత్రం వీసా రాలేదు. దాదాపు నెల రోజులు ఇంగ్లండ్‌లో ఉండాల్సి వస్తుందని.. తన కుమారుడిని కూడా తీసుకువెళ్లేందుకు అనుమతి ఇప్పించాలంటూ కేంద్ర క్రీడాశాఖను సానియా కోరింది. సానియా కుమారుడికి వీసా ఇప్పించే అంశంపై ఇంగ్లండ్‌తో కేంద్ర విదేశాంగ శాఖ చర్చలు జరుపుతోంది.