
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోస్టులతో ఇన్‌స్టాలో సందడి చేస్తోంది. సానియా విభిన్నమైన డిజైనర్ దుస్తుల్లో ఒక బాలీవుడ్ కథానాయికను తలపించడమే ఇందుకు కారణం. ముఖ్యంగా సోషల్ మీడియాలో సానియా స్టైలిష్ లుక్‌ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అభిమానులు సానియా ఆకట్టుకునే డ్రెస్సింగ్ సెన్స్ కి సోషల్ మీడియాల్లో లైక్ లతో అభిమానం కురిపిస్తున్నారు.
తాజా ఫోటోషూట్ లో 37 ఏళ్ల సానియా ఎడారిలో అలా ఒంటరిగా నిలబడి ఫోజులిచ్చింది. ఒక సాధాసీదా క్యాజువల్ వేర్ లో సానియా సింపుల్ గా కనిపించింది. ఈ ఫోటో అప్‌లోడ్ చేసిన గంటలోపే వేలాది పైగా లైక్‌లు, కిక్ లు హోరెత్తాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌తో వివాహం కారణంగా సానియా ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్‌లోను పాపులరైంది.