శానిటైజర్ వాడటం సేఫేనా?

శానిటైజర్ వాడటం సేఫేనా?

వైరస్ మనదాకా రాకూడదంటే.. మన దగ్గర శానిటైజర్ ఉండడం తప్పనిసరి. అందుకే ఇప్పుడు శానిటైజర్ కూడా ఒక నిత్యావసర వస్తువు అయింది. అయితే  ఆ శానిటైజర్‌‌‌‌‌‌‌‌తో కూడా కొన్ని రిస్క్‌‌‌‌లున్నాయి. దాన్ని సరిగ్గా వాడకపోతే.. మొదటికే ముప్పు వస్తుందంటున్నారు ఎక్స్‌‌‌‌పర్ట్స్

శానిటైజర్ వాడకంలో తెలుసుకోవా ల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. పొడిగా ఉన్న చేతులపైనే శానిటైజర్ పనిచేస్తుంది. జిడ్డుగా ఉన్న  చేతులపైన శానిటైజర్ రాసుకొని ఎలాంటి ఉపయోగం లేదు. జిడ్డు సర్ఫేస్ మీద శానిటైజర్ పని చేయదు. పైగా చేతులు జిడ్డుగా ఉంటే.. మరింత డస్ట్ చేతులకు అంటుకుంటుంది కూడా.  అలాగే తడిగా ఉన్న చేతులపై కూడా శానిటైజర్ ఎఫెక్ట్ అంతగా ఉండదు. చేతులు తడిగా ఉంటే  ఆ  తడికి శానిటైజర్ లిక్విడ్ డైల్యూట్ అవుతుంది. దాంతో శానిటైజర్ ప్రభావం కొంతవరకూ తగ్గొచ్చు.

మార్కెట్లో దొరికే చాలా శానిటైజర్లు స్పిరిట్ లేదా ఆల్కహాల్‌‌‌‌తో తయారు చేసి ఉంటాయి. అయితే.. ఆల్కహాల్ చేతిపై పడగానే.. అది చేతికున్న మాయిశ్చర్‌‌‌‌మొత్తాన్ని పీల్చుకుంటుంది. దాంతో చేతులు పొడిబారి, అప్పుడప్పుడు పై పొట్టు లేస్తుంటుంది. చేతులు పొడిబారి, పొట్టు లేస్తుంటే.. శానిటైజర్ వాడకం ఎక్కువైందని తెలుసుకోవాలి. అలాంటప్పుడు శానిటైజర్ వాడకాన్ని తగ్గించాలి.

ఆల్కహాల్ శానిటైజర్లకు బదులు కొన్ని చోట్ల యాంటీ బ్యాక్టీరియల్ శానిటైజర్స్ కూడా కనిపిస్తుంటాయి. వీటిలో ఆల్కహాల్‌‌‌‌కు బదులు ట్రైక్లోసిన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్.  వైరస్‌‌‌‌లను బాగా అరికడుతుంది. కానీ  దీంతో ఒక ముప్పు కూడా ఉంది. ఇందులో ఉండే ట్రైక్లోసిన్  నేరుగా చర్మం లోపలికి ఇంకుతుంది. అలా చర్మంలోకి చేరి న ట్రైక్లోసిన్.. ఒక్కోసారి థైరాయిడ్, లివర్‌‌‌‌‌‌‌‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంది.

శానిటైజర్ చర్మం మీద కొన్ని నిముషాల పాటు ఉంటుంది. శానిటైజర్‌‌‌‌‌‌‌‌తో చేతులు కడుక్కున్న  వెంటనే భోజనం చేయడం లేదా అదే చేతులతో ఏదైనా తినడం ద్వారా అందులో ఉండే కెమికల్స్ నేరుగా శరీరంలోకి వెళ్తాయి. దాని వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది  ఎంతో ప్రమాదం. అలాగే సువాసనలు వెదజల్లే కొన్ని శానిటైజర్లలో.. శానిటైజర్ లిక్విడ్‌‌‌‌తో పాటు ఇతర కెమికల్స్ కూడా కలిసి ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్తే.. హార్మోనల్ ఇంబాలెన్స్‌‌‌‌జరుగుతుంది. అందుకే శానిటైజర్ వాడిన వెంటనే ఆ చేతులతో ఏదీ తినకూడదు. అలాగే సువాసనలు వచ్చే శానిటైజర్లకు కూడా దూరంగా ఉండాలి.

ఇకపోతే శానిటైజర్‌‌‌‌‌‌‌‌తో కొన్ని ఫిజికల్ రిస్క్‌‌‌‌లు కూడా ఉన్నాయి. శానిటైజర్లలో ఉండే స్పిరిట్‌‌‌‌కు మండే గుణం ఉంటుంది. శానిటైజర్ రాసుకున్న చేతులను పొరపాటున మంటకు దగ్గరగా పెడితే వెంటనే మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదాలు కొన్ని చోట్ల జరిగాయి కూడా. అందుకే శానిటైజర్ రాసుకున్న తర్వాత మంటలకు దూరంగా ఉండాలి. వంటగదిలో శానిటైజర్‌‌‌‌‌‌‌‌ను  వాడొద్దు.

ఇవి వద్దు

మాస్క్‌‌‌‌లను శానిటైజర్‌‌‌‌‌‌‌‌లో ముంచి శుభ్రం చేయకూడదు. దానివల్ల కెమికల్స్.. మాస్క్‌‌‌‌కు అంటుకుని శ్వాస ద్వారా లోపలికి పోయే ప్రమాదం ఉంది.

వీలైనంత వరకూ సోప్ లేదా లిక్విడ్ హ్యాండ్‌‌‌‌వాష్‌‌‌‌ను వాడడం చాలా వరకూ సేఫ్. నీళ్లు, సోప్ లాంటివి అందుబాటులో  లేనప్పుడు మాత్రమే శానిటైజర్ వాడాలి.

శానిటైజర్‌‌‌‌‌‌‌‌ను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చల్లగా ఉండే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌‌‌‌లో ఉంచాలి.  ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉంచాలి

For More News..

వర్క్ ఫ్రం హోమ్ కంటిన్యూ..

ఉద్యోగ సంఘాల లీడర్ల చుట్టాలకు నజరానా!

మారటోరియంలో వడ్డీ వసూలు చేయకూడదు!