
ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ టెలివిజన్ టీఆర్పీ రికార్డులను బద్దలుకొట్టింది. మరోవైపు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌ల్లోనూ వ్యూస్ రేటింగ్ అంచనాల్ని దాటాయని సంస్థలు ప్రకటించుకున్నాయి. లైవ్ స్కోర్ కోసం స్పోర్ట్స్ వెబ్‌సైట్లను చూసినవాళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో ఉన్నట్లు ఇంటర్నెట్ గణాంకాలు చెప్తున్నాయి. ఇవికాకుండా సోషల్ మీడియాలో మీమ్స్, హిలేరియస్ ట్వీట్లతో జనాలు విరుచుకుపడుతున్నారు.
మ్యాచ్ మొదలుకాకముందే మొదలైన సోషల్ మీడియా గోల.. ప్రారంభమయ్యాక ఎక్కడికో వెళ్లిపోయింది. టీమిండియా ఆటగాళ్లను పొగుడుతూ.. పాక్ ఆటగాళ్ల ఫొటోలతో మీమ్స్, ట్వీట్లు తెగ సందడి చేశాయి. రోహిత్ వీరవిహారం– రన్ అవుట్ మిస్ కావడం, పాక్ బౌలర్లు పిచ్ పాడు చేయడంపై ట్రోలింగ్ నడిచింది. #BaapBaapHotaHai, #CongratulationsIndia
హ్యాష్‌ట్యాగ్‌లు బాగా ట్రెండ్ అయ్యాయి. ఈ ట్రోలింగ్ పర్వం మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. మ్యాచ్ మధ్యలో ఆవులించిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌పై వచ్చిన మీమ్స్‌కు లెక్కే లేదు. పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సలహాను టీం పెడచెవిన పెట్టడంపై ఫన్నీ ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఓటమిని జీర్ణించుకోలేని సొంత దేశ అభిమానులు కూడా పాక్ టీంను ట్రోల్ చేసి పడేస్తున్నారు.